సాధారణంగా కొందరికి శరీరం మొత్తం నాజూగ్గా ఉన్నప్పటికీ పొట్ట వద్ద మాత్రం లావుగా ఉంటుంది.దీనినే బెల్లీ ఫ్యాట్( Belly Fat ) అని అంటారు.
గంటలు తరబడి కూర్చుని ఉండడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ప్రెగ్నెన్సీ తదితర కారణాల వల్ల పొట్టు చుట్టూ ఫ్యాట్ అనేది ఫార్మ్ అయిపోతుంది.దాంతో బాడీ షేప్ అవుట్ అవుతుంది.
ఈ క్రమంలోనే పొట్ట కొవ్వును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ప్రతిరోజు మార్నింగ్ ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే బాన పొట్ట వెన్నలా కరిగిపోవడం ఖాయం.
మరింతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో వన్ టీ స్పూన్ అల్లం తురుము,( Ginger ) అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) రెండు దంచిన యాలకులు( Cardamom ) వేసుకోవాలి.వీటితో పాటు వన్ టీ స్పూన్ వాము మరియు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేస్తే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ రెడీ అయినట్టే.
రోజు మార్నింగ్ గా బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.పైగా ఈ డ్రింక్ జీర్ణక్రియ పనితీరును పెంచుతుంది.మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.గ్యాస్, అజీర్తి వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.
అంతేకాకుండా ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది మరియు ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ సైతం పని చేస్తుంది.