రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట వెన్నలా కరిగిపోతుంది..!
TeluguStop.com
సాధారణంగా కొందరికి శరీరం మొత్తం నాజూగ్గా ఉన్నప్పటికీ పొట్ట వద్ద మాత్రం లావుగా ఉంటుంది.
దీనినే బెల్లీ ఫ్యాట్( Belly Fat ) అని అంటారు.గంటలు తరబడి కూర్చుని ఉండడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ప్రెగ్నెన్సీ తదితర కారణాల వల్ల పొట్టు చుట్టూ ఫ్యాట్ అనేది ఫార్మ్ అయిపోతుంది.
దాంతో బాడీ షేప్ అవుట్ అవుతుంది.ఈ క్రమంలోనే పొట్ట కొవ్వును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రతిరోజు మార్నింగ్ ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే బాన పొట్ట వెన్నలా కరిగిపోవడం ఖాయం.
మరింతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక అందులో వన్ టీ స్పూన్ అల్లం తురుము,( Ginger ) అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) రెండు దంచిన యాలకులు( Cardamom ) వేసుకోవాలి.
వీటితో పాటు వన్ టీ స్పూన్ వాము మరియు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) మిక్స్ చేస్తే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ రెడీ అయినట్టే.
"""/" /
రోజు మార్నింగ్ గా బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.
బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
పైగా ఈ డ్రింక్ జీర్ణక్రియ పనితీరును పెంచుతుంది.మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
గ్యాస్, అజీర్తి వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.అంతేకాకుండా ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది మరియు ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ సైతం పని చేస్తుంది.
పవిత్ర కుంభమేళాలో హైటెక్ టచ్.. ఒంటె వీపున QR కోడ్ చూసి షాకైన జనం!