సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చి బాబు తన మొదటి సినిమా ఉప్పెనతో గురువుకి తగిన శిష్యుడు అనిపించుకున్నాడు.వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే.
సినిమాతో హీరో, హీరోయిన్ లకు మాత్రమే కాదు దర్శకుడు బుచ్చి బాబుకి మంచి క్రేజ్ వచ్చింది.ఇక ఈ క్రమంలో తనకు వచ్చిన ఈ క్రేజ్ తో తన సెకండ్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు బుచ్చి బాబు.
అసలైతే ఒక స్టార్ హీరోతో బుచ్చి బాబు సినిమా చేస్తాడని వార్తలు రాగా రెండో సినిమాకే స్టార్ ఛాన్స్ రావడం కష్టమని భావించి.మరో చిన్న సినిమా చేయాలని చూస్తున్నాడు బుచ్చి బాబు.
ఇక ఈ క్రమంలో లేటెస్ట్ గా బుచ్చి బాబు ఉప్పెన 2 చేస్తాడని ఫిల్మ్ నగర్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి.వైష్ణవ్ తేజ్ తోనే బుచ్చి బాబు సెకండ్ సినిమా అని వార్తలు రాగా అది ఖచ్చితంగా ఉప్పెన 2 అవుతుందని కొందరు చెబుతున్నారు.
బుచ్చి బాబు మాత్రం ఉప్ప్పెన 2 చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఉప్పెనతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన బుచ్చి బాబు తన సెకండ్ సినిమాతో కూడా ఆ స్టామినా చూపిస్తాడా లేదా అన్నది చూడాలి.
ఉప్పెన 2 చేస్తే మాత్రం ఆ సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చినట్టే లెక్క. ఉప్పెన 2 తీస్తే మాత్రం ఉప్పెన కన్నా వేరే లెవల్ లో ఉంటుందని బుచ్చి బాబు చెబుతున్నాడని తెలుస్తుంది.