న్యూస్ రౌండప్ టాప్ 20

1.అరవింద్ పై పోటీ .కవిత కామెంట్స్

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.ఇక అధినేత కేసీఆర్ ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో బిజెపి ఎంపీ అరవింద్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని కవిత అన్నారు. 

2.ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్రం ప్రకటన

 ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్రం తేల్చి చెప్పింది.టిడిపి ఎంపీ కేసినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

3.శబరిమల లో పోటెత్తిన భక్తులు

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

శబరిమల లో భక్తులు పోటెత్తారు.అయ్యప్ప దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. 

4.శబరిమలలో 90 వేల మందికి అనుమతి

  శబరిమలై లో భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం అనుమతిని ఇస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. 

5.బీఆర్ ఎస్ పై బీజేపీ కామెంట్స్

 

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

బి ఆర్ ఎస్ అనేది వ్యక్తి పేరా లేదా పార్టీ పేరా అనేది స్పష్టం చేయాలని బిజేపి నేత బూరా నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. 

6.జగన్ పై బీజేపీ కామెంట్స్

  ఏపీలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయని, అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వీటిని కట్టడి చేయాల్సిన అవసరం కేంద్రం పైన ఉందని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. 

7.బి ఆర్ ఎస్ పొత్తుపై సిపిఐ కామెంట్స్

 

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

రానున్న రోజుల్లో కేంద్రంలో బిజెపి ఓటమి తప్పదని ఆ పార్టీని తెలంగాణలోనూ నిలువరించేందుకే బి ఆర్ ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు సిపిఐ తెలంగాణ కార్యదర్శి సాంబశివరావు అన్నారు. 

8.రాజనాధ్ సింగ్ కీలక ప్రకటన

  అరుణాచల్ ప్రదేశ్ లోని తవంగ్ వద్ద చైనా సైనికులతో భారత సైనికులు ఘర్షణకు దిగిన వ్యవహారంపై రక్షణ మంత్రి రాజ నాథ్ సింగ్ స్పందించారు.చైనా దళాలు వాస్తవాదిన రేఖను అతిక్రమించాయని, మన రక్షణ దళాలు దానిని దీటుగా తిప్పుకొట్టాయని తెలిపారు. 

9.జనవరి నుంచి పాదయాత్ర చేస్తా : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు

  వచ్చే ఏడాది జనవరి నుంచి గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను బలోపేతం చేస్తానని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. 

10.టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం పూర్తి : మంత్రి ప్రశాంత్ రెడ్డి

 

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

ఢిల్లీ లో బీ ఆర్ఎస్ పార్టీ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసామని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 

11.జగన్ ను సీఎం చేయాలని వైయస్ చెప్పలేదు

 

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు చెప్పలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు అన్నారు. 

12.జగన్ నిర్ణయాలతో విద్యుత్ రంగానికి నష్టం : టీడీపీ

  ఏపీ సీఎం జగన్ నిర్ణయాలతో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. 

13.పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు : దామోదర రాజనర్సింహ

 

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

కాంగ్రెస్ లో కష్టపడిన వారికి తగిన గుర్తింపు దక్కడం లేదని మాజీ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. 

14.బి ఆర్ ఎస్ ఫ్లెక్సీల తొలగింపు

  ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు అయిన క్రమంలో వాటిని ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు తొలగించారు.అయితే ఈ ఫ్లెక్సీ లకు అనుమతి లేకపోవడంతోనే వాటిని తొలగించినట్లు అధికారులు తెలిపారు. 

15.మతమార్పిడులను ప్రోత్సహించేది లేదు : కేఏ పాల్

 

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

దేశంలో ఎక్కడ మతమార్పిడులను తాము ప్రోత్సహించేది లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పష్టం చేశారు. 

16.మాజీ ఎమ్మెల్యే మృతి

  నల్గొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమ దేవి (65) అనారోగ్యంతో మృతి చెందారు. 

17.విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోండి : హై కోర్ట్

 

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

విద్యార్థుల భద్రతకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు  తెలంగాణ పోలీసులకు సూచించింది. 

18.12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు

  తెలంగాణ లో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్ లు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. 

19.ఆసుపత్రి నుంచి షర్మిల డిశ్చార్జ్

 

Telugu Apcm, Brs, Cm Kcr, Corona, Damodararaja, Mlapayyavula, Mlc Kavitha, Shaba

పాదయాత్ర కు అనుమతి కోరుతూ తన నివాసంలోనే దీక్షకు దిగిన వైఎస్స్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అనారోగ్యానికి గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,800
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -54,330

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube