ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ యూసుఫ్ అలీని ‘‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఐకాన్’’ వరించింది.ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఇక కార్యక్రమంలో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్, ఖలీజ్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్ ఇసాక్ జాన్ పట్టనిపరంబిల్ చేతుల మీదుగా యూసుఫ్ అలీకి ఈ అవార్డ్‌ను ప్రదానం చేశారు.
జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ వ్యాపార రంగంలో చేసిన కృషికి గాను యూసుఫ్ అలీని ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు.
కేరళలో జన్మించిన అలీ.
అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ఈ గ్రూప్ వివిధ దేశాల్లో హైపర్మార్కెట్లు నిర్వహిస్తోంది.
మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, భారత్, మలేషియా, ఇండోనేషియాలో ఉన్న 220కి పైగా హైపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ద్వారా 57వేల మంది ఉపాధి పొందుతున్నారు.
మధ్యప్రాచ్యంలో అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా 2021లో యూసుఫ్‌అలీ స్థానం సంపాదించారు.
ఇదే సమయంలో గల్ఫ్‌లోని అన్ని దేశాల అధినేతలతో సన్నిహిత సంబంధం వుండటంతో మధ్యప్రాచ్యంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.వ్యాపారంలో రాణిస్తూనే.సమాజానికి ఎంతో కొంత సాయం చేస్తున్నారు.దీనిలో భాగంగాగానే కోవిడ్ 19 విపత్కర కాలంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు, కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్లు, యూపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు, హర్యానా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం అందించారు.అలాగే మధ్యప్రాచ్యంలో భారతీయుల తరపున పనిచేస్తున్న సామాజిక, సాంస్కృతిక సంస్థలకు కోటి రూపాయలు అందజేశారు.
మరోవైపు.యూసుఫ్ అలీ భారత్‌లోనూ తన వ్యాపార విస్తరణపై దృష్టిపెట్టారు.ఇప్పటికే లులు గ్రూప్‌కు మనదేశంలోని కొచ్చి, త్రిస్సూర్, త్రివేండ్రం, బెంగళూరు నగరాల్లో పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి.
వీటిని ఇతర రాష్ట్రాలకు, నగరాలకు కూడా విస్తరించాలని యూసఫ్ అలీ భావిస్తున్నారు.