జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న హైపర్ ఆదికి బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.అదిరే అభి షోలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తరువాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగి ప్రస్తుతం రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.
హైపర్ ఆది పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నో వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.హైపర్ ఆది యూట్యూబ్ వీడియోలకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
ఒకవైపు కమెడియన్ గా చేస్తున్న ఆది పలు షోలు, ఈవెంట్లకు స్క్రిప్ట్ రైటర్ గా పని చేస్తున్నారు.వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న హైపర్ ఆదికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.
కొన్నిసార్లు శృతి మించి పంచ్ లు వేస్తాడనే విమర్శలు ఉన్నా సరదా కోసమే ఆది ఆ పంచ్ లు వేస్తారు కాబట్టి ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోరు.తాజాగా ఒక అమ్మాయి హైపర్ ఆదిని అవాక్కయ్యేలా చేశారు.
లైవ్ షోలో ఆదికి ఒక అమ్మాయి ఐలవ్యూ చెప్పి హైపర్ ఆదిని అవాక్కయ్యేలా చేయగా హైపర్ ఆది రివర్స్ లో ఆమెకు అదిరిపొయే కౌంటర్ ఇచ్చారు.సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షోకు హైపర్ ఆది హాజరు కాగా ఒక కాలేజ్ అమ్మాయి ఆదికి ప్రపోజ్ చేయడంతో అందరూ ఆ అమ్మాయి మాటలు విని అవాక్కయ్యారు.అయితే రామ్ ప్రసాద్ మీ ఇంట్లో మాట్లడదాం అంటూ ఆ అమ్మాయికి షాక్ ఇచ్చారు.
హైపర్ ఆది, రామ్ ప్రసాద్, భాను శ్రీ ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ కడుపుబ్బా నవ్వించారు.
హైపర్ ఆది సుమ అత్తారింటికి దారేది స్పూఫ్ చేయగా ప్రోమోకు ఆ స్పూఫ్ హైలెట్ గా నిలిచింది.