సీఎం సహాయనిధికి 10 లక్షలు ఇచ్చిన కమెడియన్..!

కరోనా మహమ్మారి చేస్తున్న విలయతాండవం తెలిసిందే.అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.

 Commedian Suri Donate 10 Lakhs For Tamilnadu Cm Relief Fund, 10 Lakhs Cm Relief-TeluguStop.com

కరోనా బాధితులకు కొవిడ్ వైద్యం, ఆక్సీజన్, వ్యాక్సిన్ సదుపాయాలను అందించేందుకు దాతలు విరాళాలు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.సిఎం పిలుపు మేరకు ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ కొందరు సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇచ్చారు.లేటెస్ట్ గా తమిళ హాస్య నటుడు సూరి కూడా సిఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల చెక్ అందించారు.

శుక్రవారం ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు సూరి.

తన వంతుగా 10 లక్షలు.

తన కొడుకు సర్వాన్, కూతురు వెన్నెల పేరుతో మరో పాతిక్ వేల రూపాయలు విరాళంగా అందించారు.ఉదయనిధి స్టాలిన్ ను కలిసి సూరి 10 లక్షల చెక్కుని.

పాతిక వేలు నగదు అందించారు.సూరి చేసిన ఈ సహాయానికి ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకున్నారు.

అంతేకాదు సినిమాల్లో కమెడియన్ అయినా తన మంచి మనసు చాటుకుని హీరోగా నిలిచారని కోలీవుడ్ ఆడియెన్స్ సూరిని అభినందిస్తున్నారు.తమిళంలో స్టార్ కమెడియన్ గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు సూరి.

దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో అతను కమెడియన్ రోల్స్ తో మెప్పిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube