సముద్రం ఒక అద్భుతమైన, రహస్యమైన చోటు అని చెప్పవచ్చు.ఇందులో ప్రత్యేకమైన జీవులు ఎన్నో ఉంటాయి.
అయితే హిందూ మహాసముద్రం లోతుల్లో ఎన్నో వింత జీవులు నివసిస్తున్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టారు.మ్యూజియమ్స్ విక్టోరియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని టీమ్ ఆస్ట్రేలియాలోని కోకోస్ (కీలింగ్) ఐలాండ్స్ మెరైన్ పార్క్‌లోని సముద్రపు అడుగుభాగాన్ని జల్లెడ పట్టింది.
వారి అన్వేషణలో అగ్నిపర్వత శంకువులు, వలపు చీలికలు, అగాధ సముద్రపు అడుగుభాగంలో పడిపోయిన ఇసుక హిమపాతాలు, వాటి వల్ల ఏర్పడిన లోయలు కనిపించాయట.
అంతేకాదు, హిందూ మహాసముద్ర భూభాగాలలో ఇంతకు ముందు ఎవరో చూడని జీవులు కనిపించాయి.
అవి ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నాయి.వాటిలో పారదర్శకంగా, జిలాటినస్ చర్మంతో ఉన్న బ్లైండ్ ఈల్ అనిపించింది.
అంతేకాదు, ఒక వింత బాట్ ఫిష్‌ను కూడా టీమ్ కనిపెట్టింది.ఈ బాట్ ఫిష్ సముద్రపు అడుగుభాగంలో చేతి-వంటి రెక్కల మీద ఈత కొడుతూ కనిపించింది.
ఎరను ఆకర్షించడానికి వీటి ముక్కుపై చిన్న బోలులో చిన్న “ఫిషింగ్ ఎర” ఉందని బృందం తెలిపింది.అలానే ట్రిబ్యూట్ స్పైడర్ ఫిష్ కూడా వారి అన్వేషణలో బయటపడింది.

పదునైన దంతాల గల బల్లి చేపను కూడా శాస్త్రవేత్తల బృందం కనుగొన్నది.ఇలాంటి జీవులు సముద్రంలో ఉంటాయని తెలుసుకున్న తర్వాత తాము కూడా ఆశ్చర్యపోయామని శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు.వీటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.







