కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు రేపు బ్రేక్ పడనుంది.ప్రస్తుతం రాహుల్ యాత్ర కేరళలో కొనసాగిస్తున్నారు.
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఇతర నేతలు, ఎన్నికలపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపేందుకే హస్తినకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
కాగా తిరిగి ఎల్లుండికి కేరళ చేరుకోనున్న రాహుల్ .సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి మళ్లీ పాదయాత్రను కొనసాగిస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.







