వివాహ పద్ధతులు ఎన్ని రకాలు, అవి ఏమిటో తెలుసా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది.అయితే పెద్దల శాస్త్రాల ప్రకారం, వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు.

 Do You Know How Many Types Of Wedding Methods Are There And What They Are, Marri-TeluguStop.com

ఏడు అడుగుల బంధంతో వధూవరులు ఒకరి నొకరు పాణి గ్రహణం చేసుకోవడమే వివాహం.అయితే మన పురాణాల ప్రకారం వివాహం చాలా రకాలుగా జరిపించారు.

అయితే అవేంటి ఎవి ఎలా చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యను అలంకరించి వరుడికి ఇచ్చి జరిపించే వివాహం బ్రహ్మ వివాహం అవుతుంది.

అయితే యజ్ఞం చేయడం కోసం బుత్విక్కుకు కన్యని దక్షిణగా ఇవ్వడాన్ని దైవ వివాహం అంటారు.అలాగే ఆవు, ఎద్దు, దానం చేసి ఆపై కన్యను దానంగా ఇవ్వటాన్ని అర్ష వివాహం అంటారు.

మహానుభావుడికి ప్రియురాలిగా సహ ధర్మ చారిణిగా ఉండమని ఆదేశించి కన్యని ఇవ్వడాన్ని ప్రాజపత్య వివాహం అంటారు.తల్లీ, తండ్రి అనుమతి లేకుండా ఇరువురూ పెళ్లి చేసుకోవడాన్ని గాంధర్వ వివాహం అంటారు.

కన్యను బలాత్కారంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు.అలాగే కన్య నిదుర పోయేటప్పుడు, ఏమర పాటుగా ఉన్నప్పుడు… ఆమెకు తెలియకుండా అబ్బాయి వచ్చి తాళి కట్టి భార్యగా చేసుకుంటే ఆ వివాహాన్ని పైశాచిక వివాహం అంటారు.

అయితే ఇలాంటి వివాహాలన్నీ పూర్వ కాలంలో.వేద కాలంలోనే ఎక్కువగా జరిగేవి.

అయితే ఇప్పుడు కేవలం ప్రేమ పెళ్లిళ్లు.పెద్దలు కుదిర్చిన వివాహాలు మాత్రమే జరుగుతున్నాయి.

ఈ వివాహాల గురించి మన అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube