కొంచెం ఖరీదైన మాంసాహారాల్లో మటన్( Mutton ) ఒకటి.పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది మటన్ ను ఇష్టంగా తింటుంటారు.
మటన్ ఆరోగ్యానికి మంచిది అని పెద్దలు చెప్పడంతో ఖరీదు ఎక్కువైనా కూడా వారం వారం తెచ్చుకుని తినేవారు ఎంతోమంది ఉన్నారు.మరోవైపు మటన్ మంచిది కాదని.
ఫ్యాట్ అని కొందరు అవాయిడ్ చేస్తుంటారు.అసలు మటన్ తినడం లాభమా? నష్టమా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ అంటే గొర్రె లేదా మేక మాంసం.మటన్లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి.మటన్ లో ఐరన్( Iron ) మెండుగా ఉంటుంది.హీమోగ్లోబిన్ స్థాయి మెరుగుపరచడంలో, రక్తహీనతను నివారించడంలో మటన్ అద్భుతంగా సహాయపడుతుంది.
అందుకే ప్రవసరం అనంతరం బాలింతల్లో ఐరన్ కొరతను పూడ్చేందుకు మటన్ పెడుతుంటారు.అలాగే ప్రోటీన్ రిచ్ గా ఉండటం వల్ల కండరాల పెరుగుదల, శక్తి ఉత్పత్తి, మరియు శరీర పునరుద్ధరణకు మటన్ తోడ్పడుతుంది.
మటన్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు( Omega-3 Fatty Acids ) గుండె మరియు మెదడు పనితీరుకు మేలు చేస్తాయి.మటన్ లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి12, జింక్, మరియు ఫాస్ఫరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.
మటన్ తినడం లాభమా లేదా నష్టమా అనేది బరువు, ఆరోగ్య స్థితి మరియు వండే విధానంపై ఆధారపడి ఉంటుంది.సరైన మోతాదులో మరియు ఆరోగ్యకరమైన వంట విధానంలో తీసుకుంటే ఆరోగ్యపరంగా మటన్ ఎంతో మేలు చేస్తుంది.కానీ అధికంగా తినడం లేదా తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.
మటన్లో సాచ్యురేటెడ్ ఫ్యాట్( Saturated Fat ) ఎక్కువగా ఉంటుంది.అందువల్ల అధిక మొత్తంలో లేదా తరచుగా మటన్ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు.అధిక మోతాదులో మటన్ తింటే స్థూలకాయం, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టడమే కాకుండా గౌట్, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇక కొందరు మసాలాలు, నూనె ఎక్కువగా వేసుకుని మటన్ తయారు చేస్తారు.దీని కారణంగా కాలేయ వ్యాధులు, మలబద్ధకం వంటివి ఇబ్బంది పెడతాయి.ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా మటన్ తింటే లేనిపోని సమస్యలు వస్తాయి.
వారానికి ఒకసారి మాత్రమే మటన్ తీసుకోండి.మసాలాలు తక్కువగా, ఆవిరి లేదా ఉడకబెట్టిన వంటకాల రూపంలో తినండి.
హృదయ రోగాలు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు మటన్ ను ఎవైడ్ చేయడమే ఎంతో ఉత్తమం.