చైనా వివాదంపై లోక్ సభలో చర్చించే అవకాశం.. ఏం చెప్తారో !

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.నిన్న ప్రారంభమైన లోక్ సభ సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన సమావేశాలు జరిగాయి.

 Opportunity To Discuss China Dispute In Lok Sabha What To Say Parlament, Opport-TeluguStop.com

అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై చర్చించే అవకాశం ఉందని హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

చైనా వివాదంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.దీంతో ఈ వివాదంపై లోక్ సభలో చర్చించే అవకాశం ఉంది.

భారత్ కు చైనాకు మధ్య సరిహద్దు వివాదం మొదటి నుంచే ఉందని అందరికి తెలిసిందే.గాల్వాన్ లోయలో జరిగిన యుద్ధంలో భారత ఆర్మీకి చెందిన 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

చైనా ఆర్మీలో 40 మందికి పైగా ప్రాణాలు విడిచారని భారత్ ప్రకటించినా.చైనా అధికారికంగా వెలువరించలేదు.దీంతో పాటు సరిహద్దు వివాదం రోజురోజుకి పెరుగుతూ వస్తోంది.ఈ సమస్యను పరిష్కరించేందుకు విపక్షలు ఆందోళన చేపట్టడంతో ఈ రోజు జరిగే సమావేశాల్లో హోం శాఖ మంత్రి చర్చించే అవకాశం ఉంది.

జీరో అవర్ లో సుమారు 3 గంటలకు రాజ్ నాథ్ సింగ్ చైనా వివాదంపై మాట్లాడనున్నారు.అయితే తాజాగా చైనా బలగాలు ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత సీరియస్ గా మారిందని, దీనిపై మాస్కోలో జరిగిన సమావేశంలో హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనా రక్షణ శాఖ జనరల్ వెయి ఫెంగితో భేటీ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube