జనంతో జగన్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న యాత్ర 2 మూవీ పోస్టర్స్?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి( AP CM YS Jagan ) జీవితం ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర 2.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Jiva Yatra 2 Movie Posters Viral,jiva,yatra 2,ys Jagan,,pulivendula,director Mah-TeluguStop.com

కాగా 2018లో విడుదల అయిన యాత్ర సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేశారు.

ఆ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.జగన్ పాత్రలో జీవా( Hero Jiva )ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే అలా సెట్ అయిపోయాడు మరి.ఒక రకంగా జీవాని నీ దూరం నుంచి చూస్తే అచ్చం జగన్ లాగే కనిపిస్తున్నారు.

తాజాగా చివరి షెడ్యూల్‌ని సీఎం జగన్ సొంతూరు పులివెందుల( Pulivendula )లో చిత్రీకరిస్తున్నారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన డైరెక్టర్ మహీ వి రాఘవ( Mahi V Raghav ) పవర్‌ఫుల్ పోస్టర్స్ షేర్ చేయడంతో పాటు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.తాజాగా ఫొటోల్లో జగన్ పాత్రధారి జనంతో ఉంటూ వాళ్ల బాగోగులు తెలుసుకుంటూ కనిపించారు.జగన్ పాత్రలో జీవా జీవించేశాడు.నేను ప్రత్యక్షంగా చూశాను.ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజైన తర్వాత ప్రతిఒక్కరూ ఇదే మాట చెబుతారు.

నాతో ఏకీభవిస్తారు అని డైరెక్టర్ మహీ వి రాఘవ రాసుకొచ్చాడు.కాగా యాత్ర సినిమాలో వైఎస్ పాదయాత్ర పరిణామాల్ని చూపించారు.

ఇక సీక్వెల్‌లో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర( YS Jagan Odarpu Yatra ), వైఎస్సార్సీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి కావడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర విషయాల్ని చూపించబోతున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube