జనంతో జగన్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న యాత్ర 2 మూవీ పోస్టర్స్?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి( AP CM YS Jagan ) జీవితం ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర 2.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా 2018లో విడుదల అయిన యాత్ర సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేశారు.

ఆ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.జగన్ పాత్రలో జీవా( Hero Jiva )ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే అలా సెట్ అయిపోయాడు మరి.ఒక రకంగా జీవాని నీ దూరం నుంచి చూస్తే అచ్చం జగన్ లాగే కనిపిస్తున్నారు.

"""/" / తాజాగా చివరి షెడ్యూల్‌ని సీఎం జగన్ సొంతూరు పులివెందుల( Pulivendula )లో చిత్రీకరిస్తున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన డైరెక్టర్ మహీ వి రాఘవ( Mahi V Raghav ) పవర్‌ఫుల్ పోస్టర్స్ షేర్ చేయడంతో పాటు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

తాజాగా ఫొటోల్లో జగన్ పాత్రధారి జనంతో ఉంటూ వాళ్ల బాగోగులు తెలుసుకుంటూ కనిపించారు.

జగన్ పాత్రలో జీవా జీవించేశాడు.నేను ప్రత్యక్షంగా చూశాను.

ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజైన తర్వాత ప్రతిఒక్కరూ ఇదే మాట చెబుతారు.

నాతో ఏకీభవిస్తారు అని డైరెక్టర్ మహీ వి రాఘవ రాసుకొచ్చాడు.కాగా యాత్ర సినిమాలో వైఎస్ పాదయాత్ర పరిణామాల్ని చూపించారు.

"""/" / ఇక సీక్వెల్‌లో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర( YS Jagan Odarpu Yatra ), వైఎస్సార్సీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి కావడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర విషయాల్ని చూపించబోతున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

లండన్‌: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!