విశాఖ(నర్సీపట్నం): వైయస్సార్ అభయ హస్తం పేరుతో మహిళలు ఎల్ఐసీకి చెల్లిస్తున్న రెండు వేల కోట్లు ప్రభుత్వం తీసుకోవడం అన్యాయం.విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ తీరుపై విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న.
వృద్ధాప్య సమయంలో మహిళలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.అలాంటిది మహిళల ప్రమేయం లేకుండా వారి నిధులను ప్రభుత్వం తీసుకోవడం చట్టరీత్యా నేరం.
దీనిని మహిళలందరూ వ్యతిరేకించాలి.
విద్యార్థులకు మంచి మెనూ ఇస్తున్నట్టు ప్రకటించడమే తప్ప వాటి బిల్లులు ఆరు నెలల నుంచి చెల్లించడం లేదు.
ప్రతి నెలా ఒకటో తేదీ వస్తుంది అంటే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.అప్పుల కోసం వెతుకులాట తప్పడంలేదు.
దీనిలో భాగంగానే పుట్టుకొచ్చింది ఓ.టి.ఎస్. 30 ఏళ్ల నాటి ఇళ్ళకి ఇప్పుడు చెల్లింపులు ఏంటి? రిజిస్ట్రేషన్ లేంటి?
ఇదంతా వట్టి బూటకం… కేవలం నిధుల కోసమే ఈ తాపత్రయమంతా.ఓ.టి.ఎస్ పథకానికి ఎవరూ చెల్లింపులు చేయొద్దు.ఎప్పుడో పెళ్లి అయిన వారికి మళ్లీ పెళ్లి చేయడం ఏంటి? చాలా విడ్డూరంగా ఉంది.ప్రత్యేక హోదా, రైల్వేజోన్ పై ప్రధాని మెడలు వంచుతామన్న సీఎం ప్రకటనలు ఇప్పుడు ఏమయ్యాయో అర్థం కావడం లేదు.