క‌రెంట్ బిల్లు త‌క్కువ‌గా రావాలా.. అయితే ఇలా చేయండి!

క‌రెంట్ బిల్లు త‌క్కువ‌గా వ‌స్తే భ‌లే బాగుంటుంద‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, నేటి కాలంలో టీవీ, ఫ్రిడ్జ్‌, ఏసీ, వాషింగ్ మిష‌న్, ఒవెన్, గీజర్‌, రైస్ కుక్క‌ర్‌‌‌ ఇలాంటి గాడ్జెట్స్ ప్ర‌తి ఇంటికి ఉంటున్నాయి.

 What Should Be Done To Bring Down The Current Bill! Current Bill, Latest News, L-TeluguStop.com

ఇవ‌న్నీ క‌రెంట్‌తో న‌డిచేవే.ఫ‌లితంగా, క‌రెంట్ బిల్లు వంద‌ల్లో కాదు.

వేల‌ల్లో వ‌స్తోంది.అయితే ఇంట్లో ఎన్ని గ‌డ్జెట్స్‌ ఉన్నా కూడా.

కొన్ని చిన్న చిన్న‌ టిప్స్ ఫాలో అయితే కొంత‌లో కొంత అయినా క‌రెంట్ సేవ్ చేయ‌వ‌చ్చు.దాంతో క‌రెంట్ బిల్ కూడా త‌క్కువ‌గా వ‌స్తుంది.

మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా కింద‌కు ఓ లుక్కేసేయండి.

సాధారణంగా కొంద‌రు ప‌ని ఉన్నా.

లేక‌పోయినా ఫ్రిడ్జ్ డోర్ తీస్తూనే ఉంటారు.ఇలా చేయ‌డం వ‌ల్ల క‌రెంట్ ఎక్కువ తీసుకుంటుంది.

కాబ‌ట్టి, త‌ర‌చూ ఫ్రిడ్జ్ డోర్ తీసే అల‌వాటు మానుకుంటే.దానిలో చల్లదనం అలానే ఉంటుంది.

క‌రెంట్ కూడా తక్కువ ఖ‌ర్చు అవుతుంది.ఫ‌లితంగా క‌రెంట్ బిల్లు కాస్త త‌గ్గుతుంది.

ఇక ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్ డోర్ స‌రిగ్గా ప‌ట్టిందా.లేదా.

అన్న‌ది కూడా చెక్ చేసుకోవాలి.ఇక చాలా మంది చేసే పొర‌పాటు.

ఇంట్లో మామూలు బ‌ల్బులు వాడేస్తుంటారు.

ఇవి కరెంట్‌ను ఎక్కువ తీసుకుంటాయి.

అందువ‌ల్ల‌.కాస్త ఖ‌ర్చు పెట్టైనా సీఎఫ్ఎల్ బల్బులు లేదా సోలార్ ల్యాంప్స్ వంటివి కొనుగోలు చేసి వాడితే.

క‌రెంట్ సేవ్ అవుతుంది.మ‌రియు క‌రెంట్ బిల్లు కూడా త‌గ్గుతుంది.

అలాగే అంద‌రి ఇళ్ల‌ల్లోనూ కామ‌న్‌గా చేసే పొర‌పాటు.ఫొన్ చార్జర్స్ లేదా ల్యాప్ టాప్ చార్జర్స్‌ను ఫ్లగ్స్‌కే పెట్టేసే ఉంచుతారు.

ఇక్క‌డ మీకు తెలియ‌ని విష‌యం ఏంటంటే.స్విచ్ ఆన్ చేయ‌క‌పోయినా ఫ్ల‌గ్స్‌కే చార్జ‌ర్స్ పెట్టి ఉంచ‌డం వ‌ల్ల కూడా క‌రెంట్ వేస్ట్ అవుతుంది.

కాబ‌ట్టి, ఎప్పుడు కూడా చార్జింగ్ పెట్టుకున్న త‌ర్వాత ఫ్ల‌గ్స్‌కు ఉన్న చార్జ‌ర్స్‌ను తీసేసి ప‌క్క‌న పెట్టేయండి.దాంతో క‌రెంట్ బిల్ త‌క్కువ‌గా వ‌స్తుంది.

Telugu Chargers, Latest, Save-Latest News - Telugu

అలాగే మైక్రో ఓవెన్ వాడేవారు.ఒక్కసారి స్విచ్ ఆన్‌ చేశాక తరచూ తెరిచి చూస్తే క‌రెంట్ ఎక్కువ అవుతుంది.సో.ఒక్కసారి ఓవెన్ ఆన్‌ చేశాక తరచూ తెరిచే అల‌వాటు మానుకుంటే.క‌రెంట్ బిల్లు కూడా త‌గ్గుతుంది.ఇక వాషింగ్ మెషీన్‌లో ఎప్పుడూ లోడ్‌కు మించి లేదా లోడ్‌కు త‌క్కువ‌గా దుస్తులు వేయ‌కూడ‌దు.ఇలా చేస్తే అధిక క‌రెంట్ ఖ‌ర్చు అవుతుంది.అందువ‌ల్ల‌, వాషింగ్ మెషీన్‌లో లోడ్‌కు స‌మానంగా బ‌ట్ట‌లు వేస్తే.

క‌రెంట్ బిల్లు త‌క్కువ‌గా వ‌స్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube