ఆ పని చేయడంతో నా భార్య ఇంట్లోకి రానివ్వలేదు.. హీరో సుహాస్ కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా నిలుదొక్కుకోవాలంటే హీరోకు ఎన్నో క్వాలిటీస్ ఉండాలి.హీరోలకు బాడీ కటౌట్ అలాగే కలర్, నటనలో నైపుణ్యం అన్నీ ఉండాలి అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

 After Doing That, My Wife Didn't Let Me Enter The House Hero Suhan Comments Went-TeluguStop.com

ప్రేక్షకులు కమర్షియల్ చిత్రాలను మాత్రమే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంతో ఆదరిస్తున్నారు.ఈ క్రమంలోనే సినిమాలో కంటెంట్ ఉంటే హీరో హీరోయిన్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పాలి.

అయితే ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడి చివరికి హీరోగా విలన్ పాత్రలలో కూడా మెప్పించిన వారిలో కలర్ ఫోటో హీరో సుహాన్ ఒకరు.

Telugu Adivi Sesh, Color, Suhan, Tollywood-Movie

సుహాన్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ హీరో గానే సినిమాలు చేయాలని ఉద్దేశంలో లేకుండా తనకు మంచి పాత్రలు వస్తే విలన్ పాత్రలలోనైనా కమెడియన్ పాత్రలలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉన్నానని తెలిపారు.తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమాలో సైకోథ్రిల్లర్ పాత్రలో నటించిన ఈయన త్వరలోనే రైటర్ పద్మభూషణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో సుహాన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Telugu Adivi Sesh, Color, Suhan, Tollywood-Movie

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుహాన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పిన సుహాన్ తను నటించిన సినిమాలలో ఫ్యామిలీ డ్రామా సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఇందులో సుహాన్ సైకో లక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి పాత్రలో నటించారు.ఈ సినిమా విడుదలయ్యి సుహాన్ పాత్రకు ఎంతో మంచి ఆదరణ వచ్చింది.

Telugu Adivi Sesh, Color, Suhan, Tollywood-Movie

అయితే ఈ సినిమాలో సైకో లక్షణాలు ఉన్నటువంటి పాత్రలో నటించడం వల్ల తన భార్య మాత్రం తనని ఇంటికి రాకుండా ఆఫీసులోనే పడుకోమని చెప్పింది అంటూ ఈ సందర్భంగా అప్పటి విషయాలను సుహాన్ బయటపెట్టారు.ఈ సినిమా విడుదలైన తర్వాత ఇంట్లో తాను నార్మల్గా నవ్వినా కూడా తన భార్య భయపడేదని తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ప్రస్తుతం సుహాన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube