కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అంటే ఏమిటి.? ఇమ్యూనిటీ పవర్ ను ఎందుకు పెంచుకోవాలి.? వంటి విషయాలపై ప్రజలందరికీ సరైన అవగాహన వచ్చింది.ఇమ్యూనిటీ సిస్టం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే రోగాల నుంచి అంతా దూరంగా ఉండవచ్చు.
తరచూ రోగాల బారిన పడుతున్నారు అంటే మీ రోగ నిరోధక వ్యవస్థ ( Immune system )బలంగా లేదని అర్థం చేసుకోవాలి.అలాంటి సమయంలో కచ్చితంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది.మరి ఇంతకీ మన ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక క్యారెట్( Carrot ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక ఆరెంజ్ పండును కూడా తీసుకుని తొక్క వలిచి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లండర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలతో పాటు ఆరెంజ్ పండును వేసుకోవాలి.

అలాగే మూడు మిరియాలు( Black pepper ), హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అయినట్లే.ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది.ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.వారానికి రెండు సార్లు తీసుకున్న చాలు బోలెడు లాభాలు మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ డ్రింక్ లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి.
అందువల్ల ఇది ఇమ్యూనిటీ పవర్‌ను చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది.ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తుంది.
అనేక రోగాలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.అంతేకాదు ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
యవ్వనంగా మెరుస్తుంది.కంటి చూపు షార్ప్ గా తయారవుతుంది.
అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం సైతం తగ్గుతుంది.