Raasi Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఆ రోజు సినిమా పేరు మారిపోయి ఉండేది : రాశి

పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతకు ఒక ఎమోషన్.

 Raasi About Heor Pawan Kalyan Gokulam Lo Seetha Movie-TeluguStop.com

ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ పేరు మాట్లాడని యువకులు ఉండరు.సినిమాల్లో బోలెడంత సంపాదించుకునే అవకాశం ఉన్న కూడా స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో అటు వైపు అడుగులు వేసి ఎంతో పోరాటం చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చాక ఆయనపై మాటల దాడి చేసేవారు చాల మంది తయారయ్యారు.అయితే చాల మంది అయన పై వేసే ఒక నింద మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని, అమ్మాయిలను మోసం చేస్తున్నాడు అని.కానీ అయన మనసుకే తెలుసు ఏ పెళ్లి ఎలాంటి గాయం చేసింది అని.

Telugu Raasi, Rashi, Pawan Kalyan, Renu Desai, Tollywood-Movie

ఎందుకు తాను మూడు సార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.మూడు పెళ్లిళ్ల వల్ల అతడు ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వడు అని చాల చెత్త కామెంట్స్ చేస్తూ ఉంటారు.కానీ పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు.

అలాంటి వ్యక్తి కనుక అయ్యి ఉంటె ఈ రోజు ఆయనకు ఇంత లేడీ ఫాలోయింగ్ ఉండి ఉండేది కాదు.చివరికి అయన రెండవ భార్య రేణు దేశాయ్( Renu Desai ) సైతం పవన్ కళ్యాణ్ చాల మంచి వాడు అంటూ ఆమె ఇంటర్వూస్ లో చెప్తుంది.

ఇక మరొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాక మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమా తర్వాత తీసిన సినిమా గోకులం లో సీత.( Gokulam lo Seetha )

Telugu Raasi, Rashi, Pawan Kalyan, Renu Desai, Tollywood-Movie

అయితే ఈ చిత్రానికి హీరో పవన్ కళ్యాణ్ అయినప్పటికి టైటిల్ మాత్రం హీరోయిన్ పేరు పైన ఉంటుంది.అతడు తలుచుకుంటే ఒక్క నిముషం కూడా పట్టదు సినిమా పేరు మార్చుకోవడానికి.కానీ పవన్ కళ్యాణ్ ఏమి అనలేదు.అందుకే అయన ఈ రోజు పవర్ స్టార్ అయ్యాడు అంటూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తన అనుభవాన్ని పంచుకున్నారు గోకులం లో సీత హీరోయిన్ రాశి.

అంత పెద్ద ఇంటి నుంచి వచ్చిన చాల అనుకువగా ఉండేవారని, ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదని, అయన తలుచుకుంటే తన పేరు పైన సినిమా టైటిల్ పెడితే మరపించే వారని కానీ ఆలా చేయకపోవడం అయన గొప్పతనం అంటూ చెప్పారు.గోకులం లో సీత పవన్ కళ్యాణ్ కి మొట్ట మొదటి విజయాన్ని అందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube