కాలేజీలో చదువుకునే అమ్మాయిలు చేసిన ఓ పనికి వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది సదరు కాలేజీ యాజమాన్యం.ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
దీంతో ఆ నలుగురు అమ్మాయిల పరిస్థితి అయోమయంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.
తమిళనాడులోని ధర్మాపురం అధీనం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న నలుగురు అమ్మాయిలు రహస్యంగా ఓ పార్టీ చేసుకున్నారు.తమ స్నేహితురాలి పుట్టినరోజు వేడుకను ఎవ్వరికీ తెలియకుండా సీతార్ కదు గ్రామంలోని తమ స్నేహితురాలి ఇంట్లో జరుపుకున్నారు.
ఈ క్రమంలో ఓ అబ్బాయితో కలిసి నలుగురు అమ్మాయిలు బీర్లు పొంగించారు.అయితే వారు కాలేజీ డ్రెస్సులోనే ఈ నిర్వాకం చేయడం వారి కొంప ముంచింది.
పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుండగా, వీడియో కూడా తీసుకున్నారు.అయితే ఈ వీడియో బయటకు రావడంతో వారి బండారం బయటపడింది.ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ కాలేజీ పరువు తీసారంటూ కాలేజీ యాజమాన్యం నలుగురు అమ్మాయిలను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సదరు యాజమాన్యం తెలిపింది.