వాడిపోయిన పూలను పడేయకండి అంటున్న ఉపాసన, ఎందుకో తెలుసా?

చిరంజీవి కోడలు ఉపాసన సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు.ఆమె చేసే పనులు ఎక్కువగా సామాజిక సృహను కలిగించేవిగా ఉంటాయి.

 Do Not Drop Withered Flowers-TeluguStop.com

అందుకే ఉపాసన మంచి మనసుకు అంతా కూడా ఫిదా అవుతూ ఉంటారు.కోట్ల వ్యాపార సామ్రాజ్యంను నడిపిస్తున్న ఉపాసన ఖాళీ సమయం ఉన్నా లేకున్నా కూడా మంచి పనుల కోసం కష్టపడుతూనే ఉంటుంది.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన పోస్ట్‌ల ద్వారా సమాజంలో కొంతలో కొంత అయినా మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.

Telugu Dropwithered, Flowers, Upasana, Upasana Active, Upasanadont-Movie

తాజాగా ఉపాసన మరో సామాజిక అంశంతో జనాల ముందుకు వచ్చింది.మనం రెగ్యులర్‌గా వాడే పూలను వాడిపోయిన తర్వాత పడేస్తాం.కాని వాటిని పడేయకుండా రీసైక్లింగ్‌ చేయవచ్చు అంటూ ఉపాసన చెబుతోంది.

పూలను వృదాగా పడేయడం వల్ల వాతావరణం కలుషితం అవ్వడంతో పాటు వ్యర్థాలు ఎక్కువగా అవుతాయని అందుకే వాటిని రీ సైక్లింగ్‌ చేయడం వల్ల అందరికి ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది.

Telugu Dropwithered, Flowers, Upasana, Upasana Active, Upasanadont-Movie

హోలివేస్ట్‌ అనే సంస్థ ఇలా వాడిపోయిన పూలను సేకరించి వాటిని రీ సైక్లింగ్‌ చేసి వాటి ద్వారా దూప్‌స్టిక్స్‌ను మరియు పూజా సామాగ్రిని తయారు చేస్తారట.అందుకే వాడిపోయిన పూలను చెత్తలో పడవేయకుండా జాగ్రత్తగా ఉంచి వారిని సంప్రదించినట్లయితే వారు ఇంటికి వచ్చి మరీ వాడిపోయి పాడైపోయిన పూలను తీసుకుంటారంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.దేవుడికి వాడిన పూలు వాడిపోతే మళ్లీ వాటిని దేవుడికే దక్కేలా చేసేందుకు రీ సైక్లింగ్‌ చేయించడం బెటర్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube