నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రం దాదాపుగా 20 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే కనీసం 10 కోట్లు కూడా రాబట్టలేక పోయింది.అన్ని రైట్స్ అమ్మినా కూడా నిర్మాత పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు.
దాంతో బాలయ్యతో 10 కోట్లకు మించి బడ్జెట్ పెట్టి సినిమా తీయడం చాలా పెద్ద సాహస నిర్ణయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే బాలయ్య 106వ చిత్రం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది.
ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.

ఆ సినిమాను 50 కోట్లు పెట్టి బోయపాటి తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట.బాలకృష్ణ మూవీ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచినా.రికార్డులు బ్రేక్ చేసినా కూడా వసూళ్ల విషయంలో నిరాశ తప్పదు.50 కోట్లు రాబట్టడం అంటే దాదాపుగా అసాధ్యం అంటున్నారు.బాలయ్యతో పాటు కొందరు సీనియర్ హీరోల సినిమాలు బాగున్నా కూడా కొందరు ప్రేక్షకులు మాత్రమే ఆసక్తి చూపిస్తారు.
అందుకే బాలయ్యతో సినిమా అదీ 50 కోట్ల సినిమా అంటే మాత్రం నిర్మాత కొంప కొల్లేరు అయినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ బోయపాటిల కాంబోలో గతంలో సింహా మరియు లెజెండ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఆ సినిమాలు మంచి విజయాలు దక్కించుకున్నాయి.కాని ఇప్పుడు పరిస్థితి వేరు బోయపాటి మరియు బాలయ్యలు ఇద్దరు కూడా తీవ్ర కష్టాల్లో ఉన్నారు.
వారు ఎదుర్కొంటున్న ఒత్తిడిని చూస్తే కథ ఎలా రాసుకున్నారో సినిమా ఎలా తీస్తారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అందుకే 50 కోట్లు పెట్టి సినిమా తీయడం వల్ల నిర్మాతకు మాత్రం కనీసం 30 కోట్ల వరకు అయినా లాస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.







