పదో తరగతి ప్రశ్నాపత్రం లేక్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని బండి సంజయ్ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.