హమ్మయ్య.మొత్తానికి విరూపాక్ష సినిమా( Virupaksha ) చూసాక కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు మెగా ఫ్యాన్స్.
చాల రోజులుగా మితిమీరిన హీరోయిజం తో మెగా ఫ్యామిలీ సినిమాలను చూస్తుంటే ఒకరకమైన వెగటు పుట్టేస్తుంది.ఏ బాషా సినిమాను కొనుక్కొని తెలుగు లో రీమేక్ చేసిన తమ హీరోయిజం ఎక్కడ మిస్ అవ్వకుండా ఎడా పెడా మార్పులు చేర్పులు చేస్తారు.
బిల్డప్పులు ఎక్కడ డోకా ఉండకుండా చూసుకుంటారు.అయినా మెగా ఫ్యామిలీ హీరోలలోకి సాయి ధరమ్ తేజ్ ది కాస్త భిన్నమైన వ్యక్తిత్వం.
ప్రమాదం జరిగిన తర్వాత కాస్త నెమ్మదించినట్టున్నాడు.సినిమాలో కూడా ఆ ప్రభావం కనిపించింది.
నటన పరంగా మామ చిరు తో పోటీ కాకపోయినా తన మేరకు తాను బాగానే కన్విన్స్ చేయగలడు.నాసిరకం ప్రదర్శనలు అయితే కాదు.ఇక విరూపాక్ష సినిమా విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ గట్టెక్కినట్టే కనిపిస్తున్నాడు.పైగా సినిమాలో హీరోయిజం తాలూకా ఛాయలు ఎక్కడ లేవు.కానీ తెలుగు సినిమా హిట్ అవ్వాలంటే పగలు, ప్రతీకారాలు, అవసరం ఉన్న లేకపోయినా ఫైట్స్ ఉండాలి.
ఈ సినిమా అందుకు పూర్తిగా బిన్నం.మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు, అతీత శక్తుల కేంద్రం గా సాగుతుంది.సినిమాలో దర్శకుడు కొన్ని పేలవమైన సీన్స్ తీసినప్పటికి మరి చెత్త దర్శకుడు( Karthik Varma Dandu ) అయితే కాదు.
అంతే కాదు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej ) కూడా కొన్ని సీన్స్ లో పేలవమైన నటన చూపించాడు.
సాయి మంచి నటుడిగా నిలబడాలి అనుకుంటే ఇంకా చాల మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.ఇక ఈ సినిమాకు మెయిన్ అసెట్ కేవలం హీరోయిన్ సంయుక్త మీనన్.ఆమె క్లైమాక్స్ లో చక్కగా నటించి అద్భుతం చేసింది.
ఈ మధ్య సినిమాలు అన్ని కాకులతో ముడిపడి కనిపిస్తున్నాయి.మొన్న బలగం( Balagam ) ఇప్పుడు విరూపాక్ష.
జై వాయసం అంటూ కాకులతో కథలను సృష్టిస్తున్నారు.ఇక పోతే పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాను విడుదల చేసిన తెలుగు లో మాత్రమే గట్టెక్కేస్తుంది.
అయితే పేలవమైన ఒక స్క్రిప్ట్ కి బలమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం తో సినిమా గట్టెక్కింది.లేకపోతే సాయి ధరమ్ తేజ్ ని మర్చిపోవాల్సి వచ్చేది.