ఇటీవలే కాలంలో సర్దుకుపోవడం, అర్థం చేసుకోకపోవడం, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం లాంటి కారణాలవల్ల అనుకోని దారుణాలు సంభవించి రోడ్డున పడే కుటుంబాల సంఖ్య పెరుగుతూ పోతోంది.కుటుంబ సభ్యులే శత్రువులుగా మారి కుటుంబాలను నాశనం చేస్తున్నారు.
కృష్ణాజిల్లాలో( Krishna District ) ఓ వ్యక్తి సొంత తమ్ముడి చెవి కొరికాడు.అంతేకాకుండా ఆ చెవిని( Ear ) నోట్లో కరకర నములుతూ గ్రామమంతా తిరిగాడు.
ఈ వ్యక్తిని చూసి గ్రామమంతా ఒక్కసారిగా షాక్ అయింది.గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళితే కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిధిలోని సత్రం పాలెం లో సీతారామయ్య, నరసింహస్వామి అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు.గత కొంతకాలంగా వీరిమధ్య ఆస్తికి సంబంధించిన గొడవలు( Property Issues ) జరుగుతున్నాయి.
ఇటీవలే తాజాగా ఆస్తి గురించి అన్నదమ్ముల మధ్య మరోసారి గొడవ జరిగింది.మొదట మాటల యుద్ధం ప్రారంభమై చివరకు ఒకరిపై ఒకరి దాడి కి దిగారు.
అన్న సీతారామయ్య కోపంతో ఊగిపోతూ తమ్ముడు నరసింహస్వామి చెవిని గట్టిగా కోరికాడు.
తమ్ముడు నొప్పితో ఎంత అరిచినా వదలకుండా చెవిని పళ్ళతో గట్టిగా కొరకడంతో పాటు కరకర నమలడంతో చుట్టుపక్కల వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.ముందుగా గాయపడిన నరసింహ స్వామిని ఆసుపత్రికి తరలించి ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు సీతారామయ్యను అదుపులోకి తీసుకున్నారు.
అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల కారణంగా తమ్ముడి చెవి కొరికి పైశాచికంగా అన్న దాడి చేయడంతో ఒక్కసారిగా గ్రామం భయభ్రాంతులకు గురైంది.అన్నదమ్ములు అన్నాక సర్దుకుపోయి కలిసి మెలిసి ఉంటూ ఒకరికి మరొకరు తోడుగా ఉండాలి అంటూ జరిగిన సంఘటనపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం నరసింహస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోరుకుంటున్నాడు.