మహమ్మారి కరోనా వైరస్ లో చాలా రకాలు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ధారించడం జరిగింది.మొదటి రకం కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచంలో చాలా దేశాలు ఆర్ధికంగా ఇంకా చాలా రీతులుగా నష్టపోయాయి.
ఇలాంటి తరుణంలో ఇటీవల కరోనా స్ట్రెయిన్ అనే కొత్త రకం బ్రిటన్ దేశం లో బయట పడటం జరిగింది.దీంతో చాలా వరకు ప్రపంచ దేశాలు బ్రిటన్ ఉద్దేశంతో రాకపోకలు విషయంలో అనేక ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఇండియాలో కూడా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.
ఊహించని విధంగా గత కొన్ని రోజుల నుండి కేసులు సంఖ్య పెరుగుతుండటంతో ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, కేరళలో N440K, E484K కొత్తరకం కరోనా రకాలను గుర్తించినట్టు కేంద్రం తెలిపింది.
అంతేకాదు, ఇందులో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని పేర్కొంది.ఈ ప్రకటనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం.అయితే, పైన చెప్పిన రెండు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలకు ఈ కొత్త రకాలే కారణమని చెప్పలేమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు.