జూనియర్ చిరును పరిచయం చేసిన మేఘన.. వైరల్ ఫోటో!

కన్నడ సినీ నటుడు చిరంజీవి సర్జా తన నటనతో సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయనను చిరు అనే పేరుతో కూడా పిలుస్తారు.ఈయన నటుడు అర్జున్ సర్జా తో కలిసి నాలుగేళ్లపాటు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు.2018 అక్టోబర్ లో సినీనటి మేఘనా రాజ్ తో హిందూ సాంప్రదాయ ప్రకారం, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చిరు కు వివాహం జరిగింది.

 Chiranjeevi Sarja Wife Meghana Introduces Her Son To Fans, Chiranjeevi, Meghana-TeluguStop.com

చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర సినిమా తో తొలిసారిగా పరిచయం కాగా ఆ సినిమాలో తన నటనతో ఇన్నోవేటివ్ ఫిలిం అవార్డు కూడా పొందాడు.ఆ తర్వాత వరుస సినిమాలతో నటించిన చిరు.

గత ఏడాది జూన్ 7 న గుండెపోటుతో మరణించాడు.దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే 2020లో ఆయన నాలుగు సినిమాలలో అవకాశం రాగా.రాజ మార్తాండ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో మరో మూడు సినిమాలకు ఓకే కూడా చెప్పాడు.

కానీ అంతలోనే ఆయన మరణం సినీ పరిశ్రమను మొత్తం కన్నీటితో తడిపింది.

Telugu Chiranjeevi, Fans, Son, Sarja, Kannada, Meghana Raj, Simmba-Movie

ఇదిలా ఉంటే ఆయన మరణించిన సమయంలో తన భార్య మేఘన ఐదు నెలల గర్భవతి గా ఉండగా గత ఏడాది అక్టోబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ విధంగా మేఘన తన కొడుకు ను సోషల్ మీడియా ఖాతా వేదికగా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది.అంతేకాకుండా జూనియర్ చిరు(సింబా) అని పేరును కూడా ప్రకటించింది.

ఇక తను పంపిన ఈ వీడియోను చూసి నట్లయితే.అందులో తమ ఎంగేజ్మెంట్ తో ప్రారంభమవుతూ.

తన కొడుకుతో ఉన్న ఫోటోలను చూపించింది.ఈ విధంగా ” నేను పుట్టక ముందు నుంచే మీరు నన్ను ఎంతో అభిమానించారు.

మొదటి సారి మిమ్మల్ని కలుసుకుంటున్నా ఈ క్రమంలో మీ అందరికీ ఒకటే చెప్పదలచుకున్నా.మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.

నేను మీ జూనియర్ సీ” అంటూ తనకు కొడుకు ను పరిచయం చేసింది.ప్రస్తుతం ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube