ప్రముఖ టాలీవుడ్ నటి సౌందర్య మరణించి చాలా సంవత్సరాలు కాగా ఆమె మరణం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.సౌందర్య మరణం టాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు అనే సంగతి తెలిసిందే.
ప్రముఖ నటి ప్రేమ సౌందర్య( Soundharya ) మరణం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.సౌందర్య చనిపోయిన సమయంలో లైఫ్ అంటే ఇంతేనా అని అనిపించిందని ప్రేమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సౌందర్య మరణం తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్లానని నేను అక్కడికి వెళ్లిన సమయంలో సౌందర్య, ఆమె బ్రదర్ ఫోటోలు అక్కడ ఉన్నాయని ప్రేమ( Prema ) కామెంట్లు చేశారు.ఆ ఫోటోలను చూసిన వెంటనే నాకు ఏదోలా అనిపించిందని ప్రేమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సౌందర్య, ఆమె బ్రదర్ శరీరాలను బాక్స్ లో ఉంచారని తల కూడా లేదని ఆమె చెప్పుకొచ్చారు.కర్మ, రెస్పెక్ట్ మాత్రమే మన వెంట వస్తాయని ప్రేమ అన్నారు.
సౌందర్య చేతికి పెట్టుకున్న గడియారాన్ని చూసి ఆమెను గుర్తు పట్టడం జరిగిందని ప్రేమ కామెంట్లు చేశారు.అందంగా కనిపించడానికి సౌందర్య ఎంతో ఇష్టపడేవారని ప్రేమ అన్నారు.అన్నీ పర్ఫెక్ట్ లా ఉండాలని సౌందర్య భావించేవారని ప్రేమ పేర్కొన్నారు.చెమట కూడా రాకుండా ఉండాలని బాగా కనిపించాలని సౌందర్య ఫీలయ్యేవారని ఆమె చెప్పుకొచ్చారు.సౌందర్య ఎక్కువగా ఫుడ్ తినేవారు కాదని ప్రేమ తెలిపారు.
సౌందర్య నుంచి కొన్ని వంటకాల గురించి తెలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు.పంచవటి గెస్ట్ హౌస్( Panchvati Guest House ) లో ఆమె ఎక్కువగా ఉండేవారని ప్రేమ తెలిపారు.తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ వల్లే సౌందర్య, తాను తెలుగులో సక్సెస్ అయ్యామని ప్రేమ వెల్లడించారు.
ప్రేమ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ వరుస ఆఫర్లతో ప్రేమ బిజీ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.