పలుచోట్ల కరెంట్ స్తంభాలకు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినప్పుడు.తిరిగి వాటిని పరిశీలించడానికి విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఇలా రోడ్డుపై వాహనదారులకు, కాలినడకన వెళ్లే వాళ్లకు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదాలు జరుగుతుంటాయి.అంతేకాకుండా వీధులలో కూడా కరెంటు తీగలను విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా అలాగే వదిలేస్తుంటారు.
కాగా ఇటీవలే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా ,నవీపేట మండలం, సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన మీర్జా రజాక్.
ఇతని వయస్సు 30 ఏళ్లు.విద్యుత్ అధికారుల వద్ద ప్రైవేట్ ఎలక్ట్రిషన్ గా పని చేసేవాడు.
పలుచోట్ల విద్యుత్కు అంతరాయం కలిగితే దానిని పరిశీలిస్తాడు.కాగా ఇటీవలే మహారాష్ట్రకు చెందిన ఆఫ్రీన్ బేగం అనే యువతితో 3 నెలల క్రితం వివాహం జరిగింది.

ఓ వెల్డింగ్ దుకాణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.కాగా దీనిని పరిశీలించడానికి రజాక్ ను అధికారులు పిలిపించారు.కాగా దీనికి రూ.200 మాత్రమే ఒప్పందం చేసుకున్నాడు.దీంతో విద్యుత్ సరఫరాకు కారణం తెలుసుకొని స్తంభం ఎక్కి కరెంటు తీగలను సరి చేస్తున్నాడు.ఈ క్రమంలో అదే స్తంభంపై విద్యుత్ సరఫరా తో ఉన్న 11 కేవీ తీగలు రజాక్ కు తగిలాయి.
వెంటనే మంటల్లో చిక్కుకుని స్తంభానికి వేలాడాడు.వెంటనే అక్కడున్న స్థానికులు కిందకు దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు.
కాగా లైన్ మెన్ శేఖర్ సమక్షంలో ఈ ఘటన జరుగగా.పలువురు అతడిపై దాడికి దిగారు.
అతని నిర్లక్ష్యం వల్లనే రజాక్ చనిపోయాడని స్థానికులు తెలిపారు.తన కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా.కేసును దర్యాప్తు చేస్తున్నారు.