తెలంగాణలో పెండింగ్ ఎంపీ స్థానాలపై బీజేపీ( BJP ) హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఇందులో భాగంగా అభ్యర్థుల రెండో జాబితాపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది.
ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan Reddy ) ఇవాళ మినిస్టర్స్ కౌన్సిల్స్ మీటింగ్ కు హాజరు కానున్నారు.తరువాత పార్టీ పెద్దలతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలో బీజేపీ ఇటీవల విడుదల చేసిన మొదటి జాబితాతో పాటు త్వరలో ప్రకటించనున్న రెండో జాబితాపై కూడా కిషన్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.అదేవిధంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీ చేరికలపై అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం ఉంది.







