గణపయ్య నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.దేవాలయాల్లో ( Temples )వివిధ కూడళ్లలో, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో, అపార్ట్ మెంట్ లలో వివిధ రూపాలలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు కూడా చేస్తున్నారు.
మండపాల్లో ఘనపయ్యని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.
వినాయక నిమజ్జనాన్ని( Vinayaka immersion ) కొన్ని ప్రదేశాలలో మూడు రోజులకు, ఐదు రోజులకు, ఏడు రోజులకు నిర్వహిస్తారు.చివరిగా తొమ్మిది రోజులు పూర్తి అయిన తర్వాత 11వ రోజు మన దేశంలోని ప్రధాన పట్టణాలలో వైభవంగా నిమర్జనం వేడుకలను నిర్వహిస్తారు.

హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం బాద్రపద మాసంలో( Bhadrapada Masam ) అనంత చతుర్దశి రోజున వినాయక విగ్రహాలను సమీపంలోని నదులు లేదా చెరువు లేదా సముద్రాలలో నిమజ్జనం చేస్తారు.ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి ముందు సమయంలో చేయకూడని తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గణపయ్య మండపంలో గణనాథుడిని కదిలించడానికి ముందు ఉద్వాసన పూజ కచ్చితంగా చేయాలని పండితులు చెబుతున్నారు.వినాయకుడినీ ఏదైనా నది, చెరువు, సముద్ర ప్రాంతాలలో తీసుకెళ్లినప్పుడు ముందుగా గణనాథుడి విగ్రహానికి పూజారులు చెప్పిన పద్ధతిలో పూజ చేయాలి.

వినాయకుడికి ( Ganesha )సంబంధించిన వస్తువులు అన్నిటిని నీటిలో నిమజ్జనం చేయాలి.ఆ తర్వాత వినాయక విగ్రహాన్ని నెమ్మదిగా నీటిలోకి తీసుకువెళ్లి నిమర్జనం చేయాలి.ఆ తర్వాత స్వామివారిని తలుచుకుంటూ నమస్కారం చేయాలి.వచ్చే సంవత్సరం కూడా తమ కాలనీకి, ఇంటికి రావాలని మనసులో కోరుకోవాలి.గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుడికి సంబంధించిన వస్తువులను విసిరేయకూడదు.ఇంకా చెప్పాలంటే గణపయ్యను వెనుక వైపు నుంచి నీటిలో ముంచకూడదు.
కేవలం ముందు భాగం నుంచి మాత్రమే నీటిలో నిమజ్జనం చేయాలి. నీటిలో దిగే సమయంలో కింద విగ్రహాలకు కాళ్లు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి
.