మార్చి 11నుండి ZEE 5 లో స్ట్రీమ్ అవ్వబోతున్న యూత్ ఫుల్ లవ్ స్టొరీ "రౌడీ బాయ్స్"

‘ZEE 5 … ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో… అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు.

 Youthful Love Story Rowdy Boys To Stream On Zee5-TeluguStop.com

జానర్ ఏదైనా… అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది.‘ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న థియేటర్లలో విడుదలై యూత్ లో మంచి క్రెజ్ ను సంపాదించుకొని బస్టర్ మూవీ గా నిలిచిన సినిమా “రౌడి బాయ్స్“.

ఈ సినిమా మార్చి 11 నుండి’. ZEE5 లో స్ట్రీమ్ అవ్వబోతోంది.ZEE5ని సబ్‌స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే ZEE5ని డౌన్‌లోడ్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

దిల్ రాజు,శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీ కు ప‌రిచ‌యం అయిన ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు) హీరోగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ హీరోయిన్ గా నటించిన సినిమా ‘రౌడి బాయ్స్’.

శ్రీహ‌ర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది.

ఇప్పుడీ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి తీసుకొస్తోంది ‘ZEE 5’.మార్చి 11 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ZEE 5 లో ప్రతినెలా సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజ్‌ చేస్తూ.ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.ZEE 5 లో విడుదలైన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ”, “లూజర్”, “లూజర్ 2”, హీరో సుమంత్ “మళ్లీ మొదలైంది“, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ల “బంగార్రాజు” వంటివి మా ZEE 5 లో విడుదలై పెద్ద విజయం సాధించాయి.వీటి ద్వారా ప్రేక్షకులకు ZEE 5 ఎంతో దగ్గరైంది.

అలాగే చాలా రోజుల తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ “రౌడి బాయ్స్” ఔట్ అండ్ ఔట్ కాలేజ్ సినిమా.యూత్ అందరు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు , హాయిగా మీ కుటుంబ సభ్యులతో & స్నేహితులు అందరితో కలిసి ఈ సినిమా ని మార్చి 11 నుండి ZEE5 లో ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube