“హెచ్‌-1బీ”.. దరఖాస్తుల స్వీకరణ...ఏప్రిల్ 1 నుంచీ

American Immigration Accepting H1b From April 1st

నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు అమెరికాలో జారీ చేస్తామని చెప్పిన హెచ్-1 బీ వీసాల దరఖాస్తులను ఏప్రిల్‌ 1 నుంచి తీసుకోనున్నట్టు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ తెలిపింది.హెచ్‌-1బీ వీసాలకు అర్హత సాధించిన వారు అక్టోబర్‌ 1 నుంచి సంబంధిత ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

 American Immigration Accepting H1b From April 1st-TeluguStop.com

అమెరికాలో మాస్టర్ డిగ్రీ లు ఆపై చదువులు పూర్తిచేసిన వారే అందుకు అర్హులు అని నిర్ణయం తీసుకున్నట్టుగా యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.అయితే హెచ్‌1బీ వీసా ప్రక్రియలో చేసిన మార్పులతో 65 వేల వీసాల్లో కూడా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన విదేశీ విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

దాంతో అమెరికాలో ప్రతీ ఏడాది మాస్టర్స్‌ డిగ్రీలు పూర్తి చేసిన 5,340 మంది విదేశీయులకి లబ్ది చేకూరనుంది.

అయితే గతంలోనే ట్రంప్ హెచ్ 1 బీ వీసాల విషయంలో కొత్తగా కొన్ని నియమ నిభందనలు మార్చుతున్నట్టుగా ఎన్నో సార్లు తెలిపారు కూడా.కెరీర్‌ కోసం అమెరికాను ఎంచుకునే వారి ప్రతిభ, నైపుణ్యాన్ని మేం ప్రోత్సహిస్తాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube