హిందీ లో డబ్ అయిన తెలుగు సినిమాలకు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా? మొదటి రెండు సినిమాలు ఇవే

ఒక్కపుడు తెలుగు సినిమా అంటే తక్కువ చేసి చూసేవారు మన హీరో లో వేరే భాషల్లో సినిమా తీసిన , డబ్ చేసిన వేరే ఇండస్ట్రీ ల్లో కనీసం ప్రోత్సహించే వారు కూడా లేరు.మన తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి తెలుగు లో మెగాస్టార్ అయ్యాక తమిళ్ సినిమా జెంటిల్ మెన్ ని హిందీ లో రీమేక్ చేశారు కానీ అక్కడ విజయం సాధించలేదు ఇంకొన్ని సినిమాలు అక్కడ చేసిన హిందీ ప్రేక్షకులు తిరస్కరించారు ఇలా తెలుగు నుండి నాగార్జున , ఎన్టీఆర్ , వెంకటేష్ లాంటి హీరో లు కూడా అడపాదడపా హిందీలో ఇంకొన్ని భాషల్లో సినిమాలు తీసిన సరైన విజయాలు అందుకోలేదు.

 List Of Most Viewed Hindi Dubbed Telugu Movies On Youtube-TeluguStop.com

ఇదంతా ఒక్కప్పటి మాట ఇప్పుడు ట్రెండు మారింది బాసూ తెలుగు సినిమా అంటే ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది.మాన సినిమాలకి తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

పైగా యూట్యూబ్ లో హిందీ జనాలు మన తెలుగు డబ్బింగ్ సినిమాలు అంటే పడి చస్తున్నారు.మన తెలుగు హీరో ల బొమ్మ కనిపిస్తే చాలు పేర్లు చెప్పేస్తున్నారు , ఇతర సిని పరిశ్రమల్లో కూడా తెలుగు సినిమాలని కోట్లు గుమ్మరించి రీమేక్ చేసుకుంటున్నారు.

మొన్న వచ్చిన బాహుబలి మన భారతదేశం లోని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.కలెక్షన్ లు ఒక్కటే కాదు అవార్డుల్లో కూడా మనోళ్లు ముందున్నారు.

హిందీ లో డబ్ అయిన తెలుగు సినిమాల యూట్యూబ్ గిరాకీ

బహుశా ఈ తెలుగు సినిమా ల్లో మంచి కంటెంట్ సినిమాలు రావడం ఏమో హిందీ లో డబ్ అయిన దాదాపు చాలా చిత్రాలకు యూట్యూబ్ లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు.అల్లు అర్జున్ అయితే హిందీ జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇక మహేష్ ఎన్టీఆర్ పవన్ రామ్ చరణ్ ప్రభాస్ సినిమాల దుబ్బింగ్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు హిందీ అభిమానులు.అయితే హిందీలో డబ్ అయి యూట్యూబ్ లో కోట్ల మంది చూసిన తెలుగు సినిమాలు ఏంటో చూడండి.

1.సరైనోడు – 137 మిల్లియన్లు ( 13.7 కోట్ల వ్యూస్ )

బోయపాటి దర్శకత్వం లో అల్లు అర్జున్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమా సరైనోడు యూట్యూబ్ లో దుమ్ము రేపింది , ఇందులో యాక్షన్ సీన్ లు చూసి హిందీ జనాలు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిపోయారు .హిందీ డబ్ సరైనోడి 13.7 కోట్ల వ్యూస్ వచ్చాయి.

2.అ .ఆ – 112 మిలియన్లు ( 11.2 కోట్ల వ్యూస్ )


త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ సమంత నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అ.ఆ తెలుగు లో 50 కోట్లు వసూలు చేసింది , దీన్ని హిందీ లో డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే 11.2 కోట్ల మంది వీక్షించారు.

3.ఆరంజ్ – 100 మిలియన్ల ( 10 కోట్ల వ్యూస్ )


మగధీర తరువాత భారీ అంచనతో వచ్చిన ప్రేమ కథ ఆరంజ్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది , కానీ టీవీ లలో ప్రసారం అయ్యేసరికి ఆరంజ్ తెలుగు యూత్ ని బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా హిందీ లో రామ్ కి జంగ్ పెరు మీద డబ్ అయి యూట్యూబ్ లో విడుదలైంది.

ప్రస్తుతం 100 మిలియన్ల వ్యూస్ దక్కిచుకుంది.

4.DJ ( దువ్వడా జగన్నాథం ) – 94 మిలియన్లు ( 9.4 కోట్లు వ్యూస్ )


హరీష్ శంకర్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ సినిమా DJ హిందీ డబ్బింగ్ సినిమాకి 9.4 కోట్ల వ్యూస్ వచ్చాయి.

5.నితిన్ లై – 94 మిలియన్లు ( 9.4 కోట్ల వ్యూస్ )


నితిన్ నటించిన స్టైలిష్ సినిమా లై ఇక్కడ ప్లాప్ అయిన హిందీ లో మాత్రం నితిన్ కి మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది.హిందీ డబ్ లై సినిమాకి 9.4 కోట్ల వ్యూస్ వచ్చాయి.

6.ఆజ్ఞతావాసి – 81 మిలియన్లు (8.1 కోట్లు వ్యూస్ )


త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆజ్ఞతావాసి హిందీ లో ఎవడు 3 గా డబ్ అయింది.ఈ సినిమాకి 8.1 కోట్ల వ్యూస్ వచ్చాయి.

7.ధ్రువ – 75 మిలియన్లు ( 7.5 కోట్ల వ్యూస్ )


రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా యూట్యూబ్ లో దాదాపు 7.5 కోట్ల మంది చూసారు .ఈ సినిమాకి అక్కడ మంచి కామెంట్ లు కూడా చాలా వచ్చాయి.

8.ఉన్నది ఒక్కటే జిందాగి – 70 మిలియన్లు ( 7 కోట్ల వ్యూస్ )


రామ్ – శ్రీ విష్ణు నటించిన ఉన్నది ఒక్కటి జిందాగి అక్కడ దాదాపు 7 కోట్ల మంది చూసారు.

అల్లు అర్జున్ రేసు గుర్రం , ఆర్య 2 ,మహేష్ శ్రీమంతుడు , ఎన్టీఆర్ టెంపర్ , రామ్ చరణ్ మగధీర , ఎవడు , గోవిందుడు , రవితేజ రాజా ధి గ్రేట్ , ఎం ఎల్ ఏ ఇంకా చాలా హిందీ లో డబ్ అయిన తెలుగు సినిమాలకు కోట్లలో వ్యూస్ వచ్చాయి , ఇది చాలు తెలుగు సినిమా దేశం లో ఉన్న ప్రజలందరికీ చేరుతుంది అనడానికి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube