“హెచ్‌-1బీ”.. దరఖాస్తుల స్వీకరణ...ఏప్రిల్ 1 నుంచీ

నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు అమెరికాలో జారీ చేస్తామని చెప్పిన హెచ్-1 బీ వీసాల దరఖాస్తులను ఏప్రిల్‌ 1 నుంచి తీసుకోనున్నట్టు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ తెలిపింది.

హెచ్‌-1బీ వీసాలకు అర్హత సాధించిన వారు అక్టోబర్‌ 1 నుంచి సంబంధిత ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

అమెరికాలో మాస్టర్ డిగ్రీ లు ఆపై చదువులు పూర్తిచేసిన వారే అందుకు అర్హులు అని నిర్ణయం తీసుకున్నట్టుగా యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.

అయితే హెచ్‌1బీ వీసా ప్రక్రియలో చేసిన మార్పులతో 65 వేల వీసాల్లో కూడా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన విదేశీ విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

దాంతో అమెరికాలో ప్రతీ ఏడాది మాస్టర్స్‌ డిగ్రీలు పూర్తి చేసిన 5,340 మంది విదేశీయులకి లబ్ది చేకూరనుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే గతంలోనే ట్రంప్ హెచ్ 1 బీ వీసాల విషయంలో కొత్తగా కొన్ని నియమ నిభందనలు మార్చుతున్నట్టుగా ఎన్నో సార్లు తెలిపారు కూడా.

కెరీర్‌ కోసం అమెరికాను ఎంచుకునే వారి ప్రతిభ, నైపుణ్యాన్ని మేం ప్రోత్సహిస్తాం' అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Ravi Teja : ఒకప్పుడు రవితేజ ను అవమానించిన స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలని చూస్తున్నాడా..?