ఆ సినిమా నుంచి తప్పుకున్న శ్రీ లీల..!

ధమాకా హిట్ తో సూపర్ జోష్ లో ఉన్న శ్రీ లీల వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తుంది.లేటెస్ట్ గా రామ్ తో సినిమా కూడా మొదలైనట్టు తెలుస్తుంది.

 Sree Leela Exit From Mahesh Movie , Mahesh Movie, Sree Leela, Ssmb28, Tollywood,-TeluguStop.com

ఇదిలాఉంటే సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబో మూవీలో కూడా ఆమె నటిస్తుందని వార్తలు వచ్చాయి.ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుందని టాక్.

అయితే ఇప్పుడు ఆ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుందని అంటున్నారు.ధమాకా హిట్ తో తన ప్లాన్ మార్చేసుకున్న శ్రీ లీల మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయడం కన్నా సోలో హీరోయిన్ గా చేయడం బెటర్ అని భావిస్తుందట.

అందుకే ఆ సినిమాకు ముందు ఓకే చెప్పినా తర్వాత నాట్ ఓకే అనేసిందట.

త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా అంటే ఒక హీరోయిన్ తో పాటుగా సైడ్ హీరోయిన్ ఉండాల్సిందే.

అయితే అలా చేసిన హీరోయిన్స్ కు మాత్రం అంతగా కలిసి రావట్లేదు.అందుకే త్రివిక్రం సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అంటె హీరోయిన్స్ అంతగా ఆసక్తి చూపించట్లేదు.

శ్రీ లీల కూడా ఆ ఉద్దేశంతోనే ఆ సినిమా నుంచి తప్పుకుందని టాక్.ధమాకా సూపర్ హిట్ కాగా మరో హిట్ పడితే మాత్రం శ్రీలీలని ఆపడం కష్టమని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube