కాంతార సీన్ రిపీట్.. దేవుడి ఆజ్ఞను ధిక్కరించిన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడా?

సినిమాల్లో జరిగిన సంఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరిగితే కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం.గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో కాంతార మూవీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

 Kantara Scene Repeated In Karnataka District Udupi Details, Kantara, Kantara Sce-TeluguStop.com

ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో దేవుడి ఆజ్ఞను ధిక్కరించిన వ్యక్తి కోర్టు మెట్లపైనే ప్రాణాలు కోల్పోతాడు.అయితే నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని చెబితే నమ్మడానికి చాలామంది ఇష్టపడరనే సంగతి తెలిసిందే.

అయితే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఇదే తరహా ఘటన రిపీట్ అయింది.దేవుడి ఆజ్ఞను ధిక్కరించిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి దగ్గర ఉన్న పడుబిద్రి అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పడుబిద్రి ప్రాంతంలో ఉన్న జారందాయ దేవాలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

అయితే ఈ ఆలయ నిర్వహణ విషయంలో రెండు కమిటీల మధ్య గొడవ జరిగింది.

అయితే గొడవ పెద్దది కావడంతో జయ పూజారి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం జరిగింది.

ఈ నెల 7వ తేదీన భూత కోల నిర్వహించాల్సి ఉండగా దానిని నిలుపుదల చేస్తూ ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చాడు.అయితే ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.కొన్నిరోజుల క్రితమే ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం వల్లే జయపూజారి చనిపోయాడని కొత్త కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమాల విషయంలో జయపూజారి జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే ఈ తరహా ఘటన జరిగేది కాదని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటన గురించి తెలిసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube