డైరెక్టర్ సురేందర్ రెడ్డికి యాక్సిడెంట్.. డెడికేషన్ కు మెచ్చుకుంటున్న నెటిజన్స్?

సాధారణంగా మనకు ఏదైనా చిన్న గాయం తగిలితే వెంటనే డాక్టర్ని సంప్రదించి అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని చికిత్స తీసుకుంటూ ఉంటాం.ఇంకొందరు మాత్రం అటువంటి గాయాలు మామూలే అన్నట్టుగా పని వారి పని వారు చేసుకుంటూ వెళుతూ ఉంటారు.

 Surender Reddy Injured In Agent Shooting Details, Surendar Reddy, Agent Movie, L-TeluguStop.com

ఇంకొందరు ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా ఆ బాధను దిగమింగుకొని వృత్తిపై ఉన్న డెడికేషన్ తో అలాగే పని చేస్తూ ఉంటారు.ఎంత నొప్పినైనా భరించుకొని ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు.

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఇలాంటి ఎన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.చాలామంది నటీనటులు జ్వరం వచ్చిన ఏదైనా చిన్న గాయాలు అయినా సర్జరీలు జరిగిన ఆ బాధతోనే సెట్ లోకి హాజరయ్యి వారి పనిని వారు సవ్యంగా ముగించుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా గాయాలతోనే సెట్లోకి అడుగుపెట్టి తన పని తాను నిర్వర్తించాడు.అసలు ఏం జరిగిందంటే.సురేందర్ రెడ్డి అక్కినేని హీరో అఖిల్ కాంబినేషన్లో ఏజెంట్ సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో పడ్డారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.ఈ క్రమంలోనే షూటింగ్ లో భాగంగా గాయపడ్డాడు సురేందర్ రెడ్డి.

యాక్షన్ సన్నీ వేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఎడమ కాలికి గాయాలవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందించగా వైద్యులు కాలికి కట్టు కట్టారు.

Telugu Akhil, Surender Reddy, Leg, Surendar Reddy, Tollywood-Movie

అయినా సురేందర్ రెడ్డి విశ్రాంతి తీసుకోకుండా చికిత్స చేయించుకున్న వెంటనే తిరిగి మళ్ళీ సెట్లోకి అడుగుపెట్టి ఏజెంట్ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు.ఒక కాలికి గాయమైన సురేందర్ రెడ్డి వీల్ చైర్ లో సెట్లోకి హాజరై ఒక టేబుల్ పై కాలు పెట్టి సన్నివేశాలను షూట్ చేశారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన నెటిజన్లు సురేందర్ రెడ్డికి వృత్తి పట్ల ఉన్న డెడికేషన్ ని మెచ్చుకుంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube