అదిరిపోయిన Lenovo కొత్త ల్యాప్ టాప్... డ్యుయల్ స్క్రీన్స్‌తో ఒకేసారి వర్క్ చేయొచ్చు!

అవును, మీరు విన్నది నిజమే.ఇపుడు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయినటువంటి Lenovo నుండి అదిరిపోయిన కొత్త ల్యాప్ టాప్ రెండు పూర్తి పరిమాణ టచ్ స్క్రీన్స్ తో యోగా బుక్ సిరీస్ కు కొనసాగింపుగా మార్కెట్లోకి వచ్చింది.

 Lenovo Yoga Book 9i Is The Worlds First Dual Oled Screen Laptop-TeluguStop.com

Lenovo బుక్ 9 ఐ పేరుతో దీన్ని లాంచ్ చేయడం గమనార్హం.అయితే దీనిని ల్యాప్ టాప్ అని చెబుతున్నా చూడడానికి మాత్రం ట్యాబ్ సైజ్ లో ఉందని మార్కెట్ రంగ నిపుణులు కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

అయితే సాధారణ జనాలు మాత్రం మాకు ఇలాంటి ప్రొడక్ట్స్ మాత్రమే కావాలి అంటూ సోషల్ మీడియాలో గోల చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
CES 2023 లో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా ఈ ల్యాప్ టాప్ డ్యూయర్ స్క్రీన్ లు వాటంతటా అవే వంగవని గుర్తు పెట్టుకోవాలి.బేసిగ్గా మీరు ఎలాంటి ల్యాప్ టాప్ తీసుకున్నా అందులో వర్క్ చేస్తున్నప్పడు వేరే యాప్ నుంచి ఏదన్నా మెసేజ్ వచ్చినపుడు చేస్తున్న పనిని కాస్త ఆపేసి మినిమైజ్ చేసి ఆ మెసేజ్ చూడాల్సి వస్తుంది.

కానీ యోగా బుక్ 9ఐ తో ఒకేసారి 2 యాప్స్ పని చేస్తాయి కాబట్టి ఆ సమస్య ఉండదని చెబుతున్నారు.అలాగే ఈ ల్యాప్ ట్యాప్ తో కీ బోర్డు నేరుగా ఇవ్వనప్పటికీ డీటాచ్ బుల్ బ్లూ టూత్ కీ బోర్డును అందిస్తుంది.

మరో ఇషయం ఏమంటే లెనోవో స్మార్ట్ పెన్ కు ఈ ల్యాప్ ట్యాప్ సపోర్ట్ చేస్తుందని ప్రకటించింది.

ఇక దీని స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే…
1.OLED స్క్రీన్‌లు రెండూ 13.3-అంగుళాలతో వచ్చాయి.
2.2.8 కే రిజుల్యూషన్ 2880×1800 అవుట్ ఇమెజ్ ను సపోర్ట్.
3.DCI P3 కలర్స్ స్టెబిలైజేషన్ తో డాల్బీ విజన్ హెచ్ డీఆర్ ఫీచర్స్.
4.డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియో.
5.బోవర్స్ అండ్ విల్కిన్స్ సౌండ్ బార్‌.
6.13 జనరేషన్, ఐ 7 ప్రాసెసర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube