ఏంటీ.. పాక‌డం వ‌ల్ల కూడా ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

ప‌సి పిల్ల‌లు ఇంట్లో పాకుతూ ఉంటే ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో మాట‌ల్లో వివ‌రించ‌క్క‌ర్లేదు.అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.

 Amazing Health Benefits Of Crawling! Crawling, Crawling Benefits, Latest News, Health, Health Tips, Good Health, Benefits Of Crawling, Exercise-TeluguStop.com

పాక‌డం కూడా ఒక ఎక్సర్‌సైజే.అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

పాక‌డాన్ని క్రాలింగ్ అని అంటారు.పాక‌డంలోనే ఎన్నో ర‌కాలు ఉంటాయి.

 Amazing Health Benefits Of Crawling! Crawling, Crawling Benefits, Latest News, Health, Health Tips, Good Health, Benefits Of Crawling, Exercise-ఏంటీ.. పాక‌డం వ‌ల్ల కూడా ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటిలో దేన్నైనా ఎంచుకోవ‌చ్చు.రోజుకు ఒక ఇర‌వై నిమిషాల పాటు పాక‌డం వ‌ల్ల‌.

బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సైతం త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పాక‌వ‌డం వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

వేగంగా వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారికి క్రాలింగ్ ఉత్త‌మ‌మైన వ్యాయామం.ప్ర‌తి రోజు ఒక ఇర‌వై నిమిషాల పాటు పాక‌డం వ‌ల్ల శ‌రీరంలో క్యాలరీలు చాలా త్వ‌ర‌గా ఖ‌ర్చు అవుతాయి.

దాంతో సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గుతారు.ఒత్తిడికి పాక‌డం అనేది ఒక న్యాచుర‌ల్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

మైండ్‌లో ఎలాంటి ఆలోచ‌న‌లు పెట్టుకోకుండా శుభ్రంగా ఉన్న ప్ర‌దేశంలో కాసేపు పాకితే గ‌నుక‌.ఒత్తిడి నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Telugu Benefits, Exercise, Tips, Latest-Telugu Health Tips

నడుము, తొడలు వ‌ల్ల కొవ్వును క‌రిగించ‌డానికి క్రాలింగ్ గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.రెగ్యుల‌ర్ గా క్రాలింగ్ చేయ‌డం వ‌ల్ల కొవ్వు క‌రిగిపోయి ఆయా భాగాలు నాజూగ్గా మార‌తాయి.వ‌య‌సు పెరిగే కొద్ది కండ‌రాలు బ‌ల‌హీనంగా మారుతాయి.అయితే కండరాలను దృఢ‌ప‌ర‌డంలో క్రాలింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.రోజూ పాక‌డం వ‌ల్ల కాళ్లు, చేతులు, నడుము.ఇలా శరీరంలోని ప్రధాన భాగాలన్నీ కదులుతాయి.తద్వారా ఆయా భాగాలకు తగినంత వ్యాయామం అందుతుంది.ఫలితంగా కండరాలు దృఢంగా మారతాయి.క్రాలింగ్‌.ఒక ఇమ్యూనిటీ బూస్ట‌ర్‌గానూ ప‌ని చేస్తుంది.

అవును, రోజుకు క‌నీసం ప‌ది లేదా ప‌దిహేను నిమిషాలైనా పాకితే గ‌నుక రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా త‌యార‌వుతుంది.దాంతో వివిధ ర‌కాల జ‌బ్బులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube