ఏంటీ.. పాక‌డం వ‌ల్ల కూడా ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

ప‌సి పిల్ల‌లు ఇంట్లో పాకుతూ ఉంటే ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో మాట‌ల్లో వివ‌రించ‌క్క‌ర్లేదు.

అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.పాక‌డం కూడా ఒక ఎక్సర్‌సైజే.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.పాక‌డాన్ని క్రాలింగ్ అని అంటారు.

పాక‌డంలోనే ఎన్నో ర‌కాలు ఉంటాయి.వాటిలో దేన్నైనా ఎంచుకోవ‌చ్చు.

రోజుకు ఒక ఇర‌వై నిమిషాల పాటు పాక‌డం వ‌ల్ల‌.బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సైతం త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పాక‌వ‌డం వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

వేగంగా వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారికి క్రాలింగ్ ఉత్త‌మ‌మైన వ్యాయామం.ప్ర‌తి రోజు ఒక ఇర‌వై నిమిషాల పాటు పాక‌డం వ‌ల్ల శ‌రీరంలో క్యాలరీలు చాలా త్వ‌ర‌గా ఖ‌ర్చు అవుతాయి.

దాంతో సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గుతారు.ఒత్తిడికి పాక‌డం అనేది ఒక న్యాచుర‌ల్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

మైండ్‌లో ఎలాంటి ఆలోచ‌న‌లు పెట్టుకోకుండా శుభ్రంగా ఉన్న ప్ర‌దేశంలో కాసేపు పాకితే గ‌నుక‌.

ఒత్తిడి నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. """/" / నడుము, తొడలు వ‌ల్ల కొవ్వును క‌రిగించ‌డానికి క్రాలింగ్ గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.

రెగ్యుల‌ర్ గా క్రాలింగ్ చేయ‌డం వ‌ల్ల కొవ్వు క‌రిగిపోయి ఆయా భాగాలు నాజూగ్గా మార‌తాయి.

వ‌య‌సు పెరిగే కొద్ది కండ‌రాలు బ‌ల‌హీనంగా మారుతాయి.అయితే కండరాలను దృఢ‌ప‌ర‌డంలో క్రాలింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

రోజూ పాక‌డం వ‌ల్ల కాళ్లు, చేతులు, నడుము.ఇలా శరీరంలోని ప్రధాన భాగాలన్నీ కదులుతాయి.

తద్వారా ఆయా భాగాలకు తగినంత వ్యాయామం అందుతుంది.ఫలితంగా కండరాలు దృఢంగా మారతాయి.

క్రాలింగ్‌.ఒక ఇమ్యూనిటీ బూస్ట‌ర్‌గానూ ప‌ని చేస్తుంది.

అవును, రోజుకు క‌నీసం ప‌ది లేదా ప‌దిహేను నిమిషాలైనా పాకితే గ‌నుక రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా త‌యార‌వుతుంది.

దాంతో వివిధ ర‌కాల జ‌బ్బులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ…క్లారిటీ ఇచ్చిన టీమ్!