వెయ్యి గురుకులాలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి కేటీఆర్ అన్నారు.రాష్ట్రంలో తాగు, సాగునీటితో పాటు కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామన్నారు.
బీఆర్ఎస్ పాలనలో గిరిజన తండాల్లో కరెంట్, రోడ్లు వచ్చాయన్న కేటీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు తీసుకొచ్చామని తెలిపారు.అయితే మతం పేరుతో చిచ్చుపెట్టేందుకు చాలా మంది చూస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని చెప్పారు.ఈ క్రమంలో సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టాలో ఆలోచించుకోవాలని తెలిపారు.
ఈ సారి ఎన్నికల్లో చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వాలని సూచించారు.జన్ ధన్ డబ్బులు పడ్డ వాళ్లు బీజేపీకి, రైతుబంధు వచ్చిన వాళ్లు బీఆర్ఎస్ కు ఓటేయ్యండని పిలుపునిచ్చారు.







