తెలుగు రాష్ట్రాలలో మొక్కజొన్న సాగు( Maize Cultivation ) విస్తీర్ణం ఈమధ్య విపరీతంగా పెరిగింది.మొక్కజొన్న సాగు పై అవగాహన ఉంటే నష్టం అనేదే రాకుండా ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించవచ్చు.
నీరు ఇంకిపోయే నల్లరేగడి, ఎర్ర నేలలు మొక్కజొన్న సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.మొక్కజొన్నకు సుమారుగా 800 మి.మీ నీరు అవసరం అవుతుంది.అంతేకాకుండా మొక్కజొన్న పంట పూత మరియు గింజ పాలు పోసుకునే దశలో పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఖరీఫ్ ( Kharif )లో మొక్కజొన్నలు సాగు చేయాలి అనుకుంటే ఈ యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించవచ్చు.ఖరీఫ్ లో వర్షాధారంగా మొక్కజొన్నను సాగు చేయాలి అనుకుంటే.పొలంలో పదును వర్షం కురిసిన తర్వాతనే విత్తు కోవాలి.మొక్కజొన్న లో అంతర పంటగా కంది, మినుము లాంటి పంటలు వేసుకోవచ్చు.ఒక ఎకరం పొలానికి 8 కిలోల విత్తనాలు అవసరం.విత్తనాలను 60-20 సెం.మీ ఎడంతో వేసుకోవాలి.విత్తిన మూడు వారాలకు ఒక లీటరు నీటిలో 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్( Monocrotophos ) ను కలిపి పిచికారి చేస్తే కాండం తొలుచు పురుగుల నుండి పంటను సంరక్షించుకోవచ్చు.

మొక్కజొన్న పంటకు నీరు లేదా ఎరువులు అందించడానికి ముందు కలుపు లేకుండా నివారణ చర్యలు చేయాలి.పొలంలో ఎరువులు వేసేటప్పుడు నేలలో తేమ తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలి.ముఖ్యంగా మొక్కజొన్న పంట పూత మరియు గింజ పాలు పోసుకునే దశలలో ఉన్నప్పుడు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.వ్యవసాయంలో సాధారణ పద్ధతులు కాకుండా కొన్ని సరికొత్త మెళుకువలు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.







