ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ మొదటినుండి వైయస్ జగన్ సర్కార్ కి ప్రతి దాని విషయంలో షాక్ ఇవ్వడం అందరికీ తెలిసిందే.గత ఏడాది నుండి సార్వత్రిక ఎన్నికల కాన్సెప్ట్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు వైసిపి పార్టీలో కీలక నేతలకు జగన్ కి ఊహించని ట్విస్టులు నిమ్మగడ్డ ఇవ్వటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంది.
న్యాయస్థానాలలో గాని ఇంకా చాలా విషయాలలో నిమ్మగడ్డ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నారు.ఈక్రమంలో ఒకానొక సమయంలో తన పదవిని కోల్పోయిన గాని న్యాయస్థానంలో పోరాటం చేసి గెలిచి మళ్ళీ తన పదవిని కైవసం చేసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే నిమ్మగడ్డ ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు కావాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించడం అందరికీ తెలిసిందే.ఈ విషయంలో సీఎం జగన్ కూడా మొదటిలో నిమ్మగడ్డ ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వానికి చెప్పకుండా వాయిదా వేయడం జరిగిందో అప్పట్లో చంద్రబాబు -నిమ్మగడ్డ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లని, అందువల్లే ప్రభుత్వానికి ఇబ్బంది పేడుతున్నట్లు కామెంట్లు చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ.తాజాగా చంద్రబాబుకి ఫస్ట్ టైం షాక్ ఇవ్వటం జరిగింది.
పార్టీలకతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు ఇటీవల మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల కోడ్ కె విరుద్ధమని దాన్ని ఉపసంహరించుకోవాలని, ఎక్కడా కూడా మేనిఫెస్టో ప్రచారం నిర్వహించకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.