బిజెపి టికెట్ల కేటాయింపులు తీవ్ర గందరగోళం నెలకొంది.ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికే బిజెపిలో కోల్డ్ వార్ జరుగుతోంది.
అసెంబ్లీకి పోటీ చేసేందుకు బిజెపి నేతలు పోటా పోటీగా నామినేషన్లు వేశారు.వేములవాడ అసెంబ్లీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ( Eatala Rajender )అనుచరురాలు తులా ఉమ ( Tula uma )కు టికెట్ కేటాయించడంతో, ఆమె ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు .అయితే ఇక్కడ బిజెపి టిక్కెట్ ఆశించి బంగపడిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు తరఫున ఆయన వర్గీయులు నామినేషన్ వేశారు.దీంతో వేములవాడ బిజెపి( BJP ) రెండు గ్రూపులుగా విడిపోయింది.
ఈ విషయంలో కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.తాజాగా వేములవాడ టికెట్ విషయం తుల ఉమను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బిజెపి చివరకు ఆమెకు బీఫామ్ ఇచ్చేందుకు నిరాకరించింది.
![Telugu Congress, Telangana Bjp, Telengana, Tula Uma, Vemulavada, Vidyasagar Rao, Telugu Congress, Telangana Bjp, Telengana, Tula Uma, Vemulavada, Vidyasagar Rao,](https://telugustop.com/wp-content/uploads/2023/11/telengana-elections-BRS-BJP-Congress-Eatala-Rajender.jpg)
మరికొద్ది గంటల్లో నామినేషన్ ప్రక్రియ ముగియనున్న సమయంలో వేములవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ వికాస్ రావుకు ( Vikas Rao )డి ఫామ్ అందించింది.దీంతో తానే బిజెపి అభ్యర్థిగా దిగబోతున్నానని ఆశించిన తుల ఉమ కు చివరలో భంగపాటు తప్పలేదు.బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి ఈటెల రాజేందర్ చేరిన సమయంలోనే తులా ఉమ కూడా బిజెపిలో చేరారు .అప్పట్లోనే తుల ఉమ కు టికెట్ ఇచ్చే విషయంలో రాజేందర్ బిజెపి పెద్దలనుంచి హామీ కూడా పొందరు .కానీ చివరి నిమిషంలో విద్యాసాగర్ రావు బిజెపి అధిష్టానం పెద్దల వద్ద చక్రం తిప్పడం తో ఆయన కుమారుడు వికాస్ రావు కు బీఫామ్ అందింది.
![Telugu Congress, Telangana Bjp, Telengana, Tula Uma, Vemulavada, Vidyasagar Rao, Telugu Congress, Telangana Bjp, Telengana, Tula Uma, Vemulavada, Vidyasagar Rao,](https://telugustop.com/wp-content/uploads/2023/11/Tula-uma-vidyasagar-Rao-Vikas-Rao-Telangana-BJP-leaders-telengana-elections-BRS-BJP-Congress-Eatala-Rajender.jpg)
బిజెపి అభ్యర్థిగా వికాస్ రావును అధికారికంగా ప్రకటించారు.ఇదేవిధంగా సంగారెడ్డి లోను బిజెపి తమ అభ్యర్థిని మార్చింది.ముందుగా ప్రకటించిన రాజేశ్వరరావు దేశ్ పాండేకు బీఫామ్ ఇవ్వకుండా, పులిమామిడి రాజుకు బీఫామ్ అందించింది.
దీంతో చివరి నిమిషంలో తమకు మొండి చూపించడం పై తుల ఉమాతో పాటు, రాజేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అయితే వీరి అసంతృప్తి కారణంగా పార్టీ అభ్యర్థులకు జరిగే డ్యామేజ్ ను దృష్టిలో పెట్టుకుని బిజెపి కీలక నేతలు రంగంలోకి దిగబోతున్నారట.