'యానిమల్' అప్పుడే షురూ చేసిందిగా.. ఫాస్టెస్ట్ గ్రాసర్ గా రికార్డ్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”యానిమల్”(Animal).ఈ సినిమాపై మన తెలుగు ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ గా ఎదురు చూసారు.

 Ranbir Kapoor's Animal Usa Premiere Show Collections, Animal, Ranbir Kapoor-TeluguStop.com

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటించిన ‘యానిమల్’ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన ”యానిమల్” సినిమా ( Animal ).ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ కు రెడీ అయ్యింది.పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న అంటే ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడగా ఫ్యాన్స్ సినిమాను వీక్షించి అప్పుడే సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు.మరి ఈ సినిమా ప్రీమియర్స్ నుండి అయితే పాజిటివ్ టాక్ నే వచ్చింది.

దీంతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ కుమ్మేసే అవకాశం కనిపిస్తుంది.కాగా ఈ సినిమా యుఎస్ మార్కెట్ లో కూడా నెవర్ బిఫోర్ అనేలా రిలీజ్ చేసారు.

ముందు నుండి అనుకున్నట్టుగానే యుఎస్ లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.తాజాగా ఈ సినిమా అక్కడ 1 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసేసి బాలీవుడ్ సినిమాల్లోనే ఫాస్టెస్ట్ 1 మిలియన్ గ్రాసర్ గా నిలిచినట్టు తెలుస్తుంది.యుఎస్ డిస్టిబ్యూటర్స్ సైతం ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఇక డే 1 పూర్తి అయ్యే సరికి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ నమోదు చేస్తుందో చూడాలి.

మొత్తానికి ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసేలానే ఉంది.కాగా ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందించగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube