ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇక 'సలార్'కు గుమ్మడికాయ కొట్టినట్లే!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ”సలార్”(Salaar).కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.

 Prabhas Salaar Shoot Latest Update , Salaar, Prabhas, Prashanth Neel, Shruti Haa-TeluguStop.com

అయితే కరోనా కారణంగా అని ప్రభాస్ మిగతా సినిమాల వల్ల కొంత ఆలస్యం అవుతూ వస్తుంది.అందుకే షూట్ స్టార్ట్ అయ్యి ఇన్నాళ్లు అవుతున్న ఇంకా బ్యాలెన్స్ అలానే ఉండిపోయింది.

కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ ఆ తర్వాత వెంటనే సలార్ సినిమాను స్టార్ట్ చేసాడు. దీంతో డార్లింగ్ మిగతా సినిమాల కంటే ఈ సినిమా హైప్ మరింత పెరిగింది.

ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు.వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ గురించి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ వచ్చింది.ఈ సినిమా షూటింగ్ ఫైనల్ కు చేరుకుందట.లాస్ట్ షెడ్యూల్ ను మేకర్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ షూట్ కేవలం కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది అని దీనితో సలార్ కు గుమ్మడికాయ కొట్టేస్తారని అంటున్నారు.

మొత్తానికి ఎప్పుడో స్టార్ట్ అయిన షూట్ ఇన్నాళ్లకు ముగియ బోతుంది.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube