రీసెంట్‌గా ఒక హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోలో ఒక ఇటాలియన్ అమ్మమ్మ( Italian grandmother ) తన మనవడికి ప్రేమను, రుచికరమైన ఆహారాన్ని అందించింది.
ఇటాలియన్ అమ్మమ్మ పేరు నోన్నా.ఆమె కష్టపడి పనిచేసే తన మనవడికి ప్రేమను, రుచికరమైన హోమ్ ఫుడ్స్ ( Home Foods )అందించి ప్రేమను చాటుకుంది.
ఇంటి నుంచే పనిచేస్తున్న మనవడికి రోజంతా అమ్మమ్మ అనేక రకాల స్నాక్స్ భోజనాలను సర్వ్ చేస్తుంది.
వీడియో ప్రారంభంలో నోన్నా( Nonna ) తన మనవడికి కాఫీ, బిస్కెట్లతో బ్రేక్ ఫాస్ట్ అందిస్తుంది.తర్వాత చాక్లెట్ పాన్‌కేక్‌లు, టీ, ఫ్రెష్ పైనాపిల్ ముక్కలు, ఎండిన బిళ్లపండ్లను అతనికి స్నాక్స్‌గా ఇస్తుంది.తరువాత, ఆమె తాజాగా కాల్చిన బిస్కోట్టిలతో మనవడిని ఆశ్చర్యపరుస్తుంది.
మధ్యాహ్న భోజనానికి రుచికరమైన సూప్, రొట్టె, కివి పండు, టమాటో, జున్ను, బెండకాయతో కూడిన ప్లేట్ అందిస్తుంది.
ఈ వీడియో నోన్నా తన మనవడి పట్ల ప్రేమను, ఆప్యాయతను చూపిస్తుంది.ఇంటి నుంచే పనిచేస్తూ ఉన్నప్పటికీ, ఆమె అతనికి రుచికరమైన ఆహారాన్ని అందించడం ద్వారా అతనికి మద్దతు ఇస్తోంది.ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా మందిని కదిలించింది.
ఈ వీడియోలో నోన్నా మనవడి పట్ల చూపించే అపారమైన కేరింగ్, లవ్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు.ఆమె ఆహారం ద్వారా లవ్ ఎక్స్‌ప్రెస్ చేస్తోంది.
నోన్నా ఒక ప్లేట్ ఆహారాన్ని అందించిన ప్రతిసారీ మనవడి ముఖంలో కనిపించే నవ్వు ఆమె ప్రేమకు నిదర్శనం.మే 28న షేర్ చేసిన ఈ వీడియో లక్షలాది మంది ప్రజల హృదయాలను తాకింది, వారిలో ఎమోషన్స్, మధురమైన జ్ఞాపకాలను మేల్కొల్పింది.
అమ్మమ్మలతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంత బాగుంటుందా అని మరి కొంతమంది కామెంట్లు చేశారు.