టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో మాధవీలత ( Madhavi Latha ) ఒకరు.ఈ నటి చేసిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు మాధవీలత కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
మాధవీలత అభినయానికి సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మాధవీలత షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఇంటర్ లో మన ఫ్రెండ్స్ వేర్వేరు గ్రూప్స్ తీసుకుంటారని ఆమె అన్నారు.
ఎవరి ఆశయాలకు అనుగుణంగా వాళ్లు గ్రూప్స్ తీసుకుంటారని ఆమె తెలిపారు.
మా కుటుంబం యాంటీ కాంగ్రెస్( Anti-Congress ) అని మాధవీలత పేర్కొన్నారు.మోదీగారు ( Modi ) వచ్చిన తర్వాత ఆర్మీ వాళ్లకు ఎంతో సపోర్ట్ గా నిలిచారని ఆమె తెలిపారు.
పవన్ గారు( Pawan Kalyan ) బీజేపీతో కలిసి నడుస్తారని భావించానని అదే జరిగిందని మాధవీలత పేర్కొన్నారు.మనపై ట్రోల్స్ వస్తున్నాయంటే మనం ఇతరుల కంటే ఏదో బలంగా మాట్లాడుతున్నామని అర్థం అని ఆమె పేర్కొన్నారు.

నేను న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నానని మాధవీలత వెల్లడించారు.దేశం గురించి, దేశ రక్షణ గురించి మాట్లాడితే బీజేపీ( BJP ) మనిషివా అని అంటారని ఆమె పేర్కొన్నారు.రఘురామ కృష్ణంరాజును పదేపదే టార్గెట్ చేసి ట్రోల్స్ చేయడం జరిగిందని మాధవీలత చెప్పుకొచ్చారు.మాధవీలత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మాధవీలత కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఆమె పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెడితే మంచి పొలిటీషియన్ అవుతారని నెటిజన్లు చెబుతున్నారు.మాధవీలత సినిమాలకు మాత్రం పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మాధవీలత నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి కెరీర్ పరంగా మరింత ఎదగాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.