దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) శుక్రవారం చంద్రబాబు నాయుడుని( Chandrababu Naidu ) కలవడం జరిగింది.అనంతరం చింతమనేని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలిసినట్లు స్పష్టం చేశారు.కౌంటింగ్ జరగటం ఆలస్యం ఆయన ముఖ్యమంత్రి( Chief Minister ) అవుతారు.
ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు ఎంత మెజారిటీ వస్తుందని ప్రశ్నించగా.మీరు ఊహించనంతగా.
తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకు అందనంతగా ఫలితాలు రాబోతున్నాయని పేర్కొన్నారు.ఆ విధంగా కూటమి గెలిచి అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు.
దేనినైనా ప్రజాస్వామ్య పరంగా ఎదుర్కోవటంలో మా నాయకుడికి మంచి అవగాహన ఉంది.తెలుగుదేశం ఇప్పుడు పుట్టిన పార్టీ కాదు.ఎలాంటి దాడులు జరిగిన దానిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జూన్ 4వ తారీఖు ఏపీ ఫలితాలు రాబోతున్నాయి.చింతమనేని ప్రభాకర్ 2019 ఎన్నికలలో ఓటమిపాలయ్యారు.అంతకుముందు 2009, 2014 ఎన్నికలలో గెలిచారు.
దీంతో ఈసారి 2024 ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని ఎన్నో పోరాటాలు చేశారు.ప్రచారంలో కీలకంగా రాణించారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో చింతమనేని కుటుంబ సభ్యులు సైతం దెందులూరు నియోజకవర్గంలో( Denduluru ) ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.వైసీపీ తరఫున అబయ్య చౌదరి పోటీ చేయడం జరిగింది.
దెందులూరులో ఈ ఇద్దరు నాయకుల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు నియోజకవర్గంలో టాక్.